- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోదాడలో ఘోరం.. 10 మంది చిన్నారులపై పిచ్చికుక్కల దాడి
ఇంటి లోపల వరండాలో ఆడుకుంటున్న మూడు సంవత్సరాల బాలుడు పై కుక్క దాడి చేసికరిచింది.

దిశ, కోదాడ : ఇంటి లోపల వరండాలో ఆడుకుంటున్న మూడు సంవత్సరాల బాలుడు పై కుక్క దాడి చేసికరిచింది. ఈ సంఘటన సోమవారం కోదాడ పట్టణంలో ఖమ్మం క్రాస్ రోడ్ లో చోటు చేసుకుంది. ఖమ్మం క్రాస్ రోడ్ లో 18 వ వార్డులో నివాసముంటున్న కొండపల్లి రవి కుమారుడు కొండపల్లి వర్షిత్ ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నాడు. అకస్మాత్తుగా గేటు కింద నుండి వచ్చిన కుక్క బాలుడు పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో తల్లిదండ్రులలో హుటాహుటిన కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన చికిత్స కొరకు సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు సూచించడంతో సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి చిన్నారులను తీసుకెళ్లారు. కుక్క అడుగు మందులు లేక నల్లగొండ ఏరియా హాస్పిటల్ కి చికిత్స చేయిస్తున్నారు.
ఇదే కుక్క గణేష్ నగర్ తిలక్ నగర్ ఖమ్మం క్రాస్ రోడ్ లోని సుమారు 17 మందిపై ఒకేరోజు దాడి చేసినట్లుగా సమాచారం. కుక్కలు విపరీతంగా రోడ్లపై తిరుగుతున్న మున్సిపాలిటీ అధికారులు వాటినీ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఇటీవల కుక్క దాడిలో రాష్ట్రవ్యాప్తంగా అనేక మరణాలు నమోదు అవుతున్నాయి. అయినా అధికారులు మొద్దు నిద్ర వేయడం లేదని పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అనంతగిరి మండల పరిధిలోని త్రిపురారం గ్రామంలో బయట ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు రాయబారపు క్రిష్, రాయబారపు తనుశ్రీ లపై కుక్కలు దాడి చేశాయి. వీరికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రి తరలించారు. కుక్క కాటుకు మందులు లేక నల్లగొండ ఏరియా చికిత్స పొందుతున్న చిన్నారులు. ఇంత జరుగుతున్న అటు మున్సిపల్ అధికారులు కానీ గ్రామపంచాయతీ సిబ్బంది గానీ. పట్టించుకున్న దాఖలాలు లేవు. స్థానిక తాజా మాజీ కౌన్సిలర్ కర్రీ శివ సుబ్బారావు వార్డు సభ్యులు స్పందించి ఆ కుక్కను పట్టుకొని నిర్బంధించినట్లు తెలిపారు.






