- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోడ్ కూసిందని దిమ్మెలకు బతుకమ్మ చీరలు కప్పిన వైనం
మున్సిపల్ ఎన్నికల కోడ్ కూసిందని ఎన్నికల నిబంధనల ప్రకారం వివిధ పార్టీలకు చెందిన దిమ్మెలకు ఓటర్లు ప్రభావితం కాకుండా ఉండాలని బట్టతో కప్పడం జరుగుతుంది.

దిశ, మోత్కూరు : మున్సిపల్ ఎన్నికల కోడ్ కూసిందని ఎన్నికల నిబంధనల ప్రకారం వివిధ పార్టీలకు చెందిన దిమ్మెలకు ఓటర్లు ప్రభావితం కాకుండా ఉండాలని బట్టతో కప్పడం జరుగుతుంది. అందుకు భిన్నంగా మోత్కూరు మున్సిపాలిటీలో వ్యవహరించిన తీరు పట్ల పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న సీఐటీయూ దిమ్మెకు బతకమ్మ చీరలను కప్పి కవర్ చేసారు. ఎవరో తమను గమనించారని తెల్లవారేసరికి బతుకమ్మ చీరలను తొలగించి తెల్ల గుడ్డతో కప్పారు. అధికార మార్పిడి జరిగి రెండేళ్ల క్రితం పంపిణీ చేసిన చీరలలో కొన్ని మిగిలించుకొని ఇటువంటి అవసరాలకు వాడుకోవడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాసులను వెనకేసుకునేందుకు ఎన్నికల ఖర్చులకు ఆడిట్ ఉండదనే నిబంధన చేసుకొని మునిసిపల్ అధికారులు వ్యవహరించిన తీరును పలువురు తప్పు పడుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం లో కూడా పార్టీ దిమ్మెలలో విగ్రహాలపై కప్పేందుకు ఉపయోగించిన బతుకమ్మ చీరలను తెల్లవారక ముందే హడావుడిగా తొలగించి తెల్ల బట్టతో కవర్ చేయడం పట్ల రాత్రిక రాత్రికే ఇలాంటి మార్పు చేయడం పట్ల ఆంతర్యం ఏమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు. మున్సిపాలిటీ వ్యవహరించిన తీరుపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కేంద్ర ప్రజలు కోరుకుంటున్నారు.






