- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్
రీజినల్ రింగ్ రోడ్డు అత్యధికంగా మునుగోడు నుండే వెళ్తుందని, అయినా త్రిబుల్ ఆర్ వెళ్లే నియోజకవర్గ ఎమ్మెల్యేలతో ఇప్పటివరకు

దిశ, సంస్థాన్ నారాయణపురం: రీజినల్ రింగ్ రోడ్డు అత్యధికంగా మునుగోడు నుండే వెళ్తుందని, అయినా త్రిబుల్ ఆర్ వెళ్లే నియోజకవర్గ ఎమ్మెల్యేలతో ఇప్పటివరకు సీఎం రేవంత్ ఎందుకు సమావేశం పెట్టలేదని ప్రశ్నించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో త్రిబుల్ ఆర్ భూ నిర్వాసితులతో ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర మంత్రులు బిజెపి నాయకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉత్తరభాగం అలైన్మెంట్ నేటికీ మారలేదని.. ఆ అలైన్మెంట్ మారాలంటే ప్రభుత్వమే మారాలి కావచ్చు అని కామెంట్ చేశారు.
హెచ్ఎండిఏ త్రిబుల్ ఆర్ దక్షిణభాగానికి నోటిఫికేషన్ విడుదల చేసిందని....నియోజకవర్గ ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ.... త్రిబుల్ ఆర్ రైతులకు అన్యాయం జరుగుతే తాను ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. అందుకు భూ నిర్వాసితులంతా తన వెంట నడవాలని సూచించారు.
త్రిబుల్ ఆర్ పూర్తిగా రద్దు అయిన పర్వాలేదు కానీ రైతులకు అన్యాయం జరిగితే సహించబోనని హెచ్చరించారు. రాజగోపాల్ రెడ్డి ప్రాణాలు పోయినా త్రిబుల్ ఆర్ భూనిర్వాసితులకు అన్యాయం జరగనివ్వనని హామీ ఇచ్చారు. తాను అడ్డు నిలబడితే ఎదుర్కొనే దమ్ము ఎవరికుందని ప్రశ్నించారు. త్రిబుల్ ఆర్ నిర్వాసితులకు అన్యాయం జరిగితే తాను ఏ త్యాగానికైనా సిద్ధమని మరోసారి గుర్తు చేశారు. త్రిబుల్ ఆర్ భూ నిర్వాసితుల కోసం తీసుకోబోయే ఏ నిర్ణయానికైనా మీ మద్దతు ఉంటే తాను ముందుండి నడిపిస్తానని తెలిపారు.






