ఘనంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు

by Dishanational2 |
ఘనంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు
X

దిశ, మునుగోడు: మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 56వ జన్మదిన వేడుకలను బీజేపీ అధ్వర్యంలో మునుగోడు మండల కేంద్రంలో గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో కేక్ ను కట్ చేసి రక్తదాన శిబిరాన్ని నిర్వహించి అన్నదానం చేశారు. అనంతరం చౌరస్తాలో కేక్ ను కట్ చేసి పంపిణీ చేశారు. భారీ సంఖ్యలో నాయకులు,యువకులు పాల్గొని రక్తదానం చేసి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షం గౌడ్, బిజెపి రాష్ట్ర నాయకులు వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, బిజెపి జిల్లా నాయకులు బూడిద లింగయ్య యాదవ్, చెరుపల్లి వెంకన్న, మేకల ప్రమోద్ రెడ్డి, పాల్వాయి జితేందర్ రెడ్డి, పాలకూరి యాదయ్య గౌడ్, మాధగోని రాజేష్, పొలగోని ప్రకాశ్, సాగర్ల లింగస్వామి, దర్శనం వేణు, మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సైదులు, నడిపల్లి యాదగిరి, జక్కలి శ్రీనివాస్, పందుల భాస్కర్, ఎండి అన్వర్, మునుగోటి సాయి, బోయ సురేష్, బీసం విజయ్, దేసిడి యాదయ్య గౌడ్, జాల మణి, బోయపర్తి ప్రసాద్, శేఖర్ రెడ్డి, దేసిడి శ్రీనివాస్ గౌడ్, బొడిగే అశోక్, దుబ్బ రాజు, సులేమాన్, జిట్టగొని సైదులు, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed