- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మృతుల కుటుంబాలను పరామర్శించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
by Mallepaka Hamsa |
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో రోడ్డు ప్రమాదంలో, మృతి చెందిన కుటుంబాలను మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు..

X
దిశ,చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో రోడ్డు ప్రమాదంలో, మృతి చెందిన కుటుంబాలను మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు.
ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం, గాయాలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు 50 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఒకే ఊరిలో నలుగురు మహిళలు చనిపోవడం బాధాకరమని, కంపెనీ యాజమాన్యం కూడా స్పందించి ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఆయన కోరారు. భవిష్యత్తులో కూడా కుటుంబాలకు ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
Next Story






