ఓటరు జాబితా పై అభ్యంతరాలు తెలపాలి

by velandi.Saikiran |

రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఓటరు జాబితాలను రాజకీయ పక్షాల నాయకులు సరిచూసుకోవాలని కోదాడ ఆర్డీవో

ఓటరు జాబితా పై అభ్యంతరాలు తెలపాలి
X

దిశ, కోదాడ: రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఓటరు జాబితాలను రాజకీయ పక్షాల నాయకులు సరిచూసుకోవాలని కోదాడ ఆర్డీవో సిహెచ్ సూర్యనారాయణ అన్నారు. శనివారం కోదాడ ఆర్డిఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో ఓటర్ జాబితాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. రాజకీయ పక్షాల నాయకులు ఓటర్ జాబితాలను ఎంపీడీవో కార్యాలయాలు నుండి పొందవచ్చు అన్నారు. అభ్యంతరాలు ఉంటే వెంటనే సంబంధిత అధికారికి తెలియజేయాలన్నారు. సమావేశంలో తహసిల్దార్ వాజిద్ అలీ, ఎంపీడీవో ఇసాక్ హుస్సేన్, ఎంపీ ఓ పాండురంగన్న యాదవ్, పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు

Next Story