- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెల్లవారుజామున తెరిచి ఉన్న జీఎస్టీ కార్యాలయం...?
కోదాడ పట్టణంలోని జీఎస్టీ కార్యాలయం తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల సమయంలో తెరిచి ఉంది.

దిశ, కోదాడ : కోదాడ పట్టణంలోని జీఎస్టీ కార్యాలయం తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల సమయంలో తెరిచి ఉంది. సాయంత్రం మూసివేసిన కార్యాలయం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో తెరిచి ఉండటంపై పలు అనుమానాలకు తావిస్తుంది...? కార్యాలయ సంబంధిత అధికారి ఓ ప్రైవేటు వాహనంలో ఆ సమయంలో కార్యాలయానికి వచ్చారని తెలుస్తుంది. అంత ముఖ్యమైన పని తెల్లవారుజామున చేసే పని కార్యాలయంలో ఏముంటుందో అని పలువురు పట్టణ ప్రజల గుసగుసలాడుతున్నారు.. ఏమైనా తనిఖీలు చేయాల్సి ఉంటే ప్రభుత్వ వాహనంలో అధికారి రావాలి కానీ ప్రైవేటు వాహనంలో అది కూడా సీటివో ఆన్ గౌట్ డ్యూటీ అని నెంబర్ బోర్డు పెట్టుకోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు...
ప్రభుత్వ కార్యాలయం టాక్స్ ప్లేట్ వాహనాలు వాడాల్సిన అధికారులు తమ సొంత వాహనాలు పెట్టుకుని ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణ వినిపిస్తున్నాయి. కార్యాలయం సమీపంలోనే ఓ లారీ ఆగి ఉండడం లారీకి సంబంధించిన వ్యక్తులు కార్యాలయంలో ఉన్నారానీ , అసలు కార్యాలయంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు... ఇదే విషయమై జెసి ఆఫీస్ నల్లగొండ... కమర్షియల్ టాక్స్... వారిని వివరణ అడగ్గా.. వాహనానికి సంబంధించి అధికారి తిరిగేందుకు మేము నెల నెల బిల్లులు చేస్తున్నామని తెలిపారు. ఏమైనా సమాచారం కావాలంటే మీరు స్థానిక సిటిఓ ఆఫీస్ లోనే సంప్రదించాలి అన్నారు.






