చల్లగా చిల్ అవుదామనుకుంటే... కోదాడ బార్‌లో షాక్..!

by Kavya |
చల్లగా చిల్ అవుదామనుకుంటే... కోదాడ బార్‌లో షాక్..!
X

దిశ, కోదాడ : డబ్బులు చెల్లించి బీరు తీసుకున్న యువకుడికి ఎక్స్పరి డేట్ అయిపోయిన బీరును అందించారు కోదాడ పట్టణంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహకులు. యువకుడు తెలిపిన వివరాల ప్రకారం... బస్టాండ్ సమీపంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ కి వెళ్లిడబ్బులు చెల్లించి కింగ్ ఫిషర్ బీర్ తీసుకున్నానని కానీ నిర్వాహకులు నాకు ఎక్స్పైరీ డేట్ అయిపోయిన బీరును ఇచ్చారని తెలిపారు. కొంచెం తాగిన తర్వాత ఈ విషయం గ్రహించానని పేర్కొన్నారు. ఇదే విషయమై నిర్వాహకులను అడిగిన వారు పట్టించుకోకుండా నిర్లక్ష్యము సమాధానం చెబుతున్నారని వాపోయారు.


ఇలా ఎక్స్పరి డేట్ అయిపోయిన బీరుని విక్రయిస్తున్న బార్ అండ్ రెస్టారెంట్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బార్ అండ్ రెస్టారెంట్లపై పూర్తిస్థాయిలో అధికారుల పరివేక్షణ కొరబడిందని గతంలో కూడా ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద ఓ రెస్టారెంట్లో వీరిలో నలకలు, పాకురు వచ్చినా అధికారులు కనీసం బార్ అండ్ రెస్టారెంట్ పై చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పుడేమో ఎక్స్పైర్ డేట్ అయిపోయిన బీర్లను దర్జాగా అమ్ముతున్న సంబంధిత అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరించడంపై పట్టణ ప్రజలు మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed