నకిలీ పత్రాలతో కాలేజ్.. నిబంధనలు మట్టిలో, నివేదికలు డస్ట్‌బిన్‌లో..!

by Bhanu |

ఓ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలంటేనే సంబంధిత పత్రాలు లేవంటూ విద్యాశాఖ అధికారులు కొర్రీలు పెట్టి నెలల తరబడి విద్యాశాఖ కార్యాలయం

నకిలీ పత్రాలతో కాలేజ్.. నిబంధనలు మట్టిలో, నివేదికలు డస్ట్‌బిన్‌లో..!
X

దిశ, నల్లగొండ బ్యూరో: ఓ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలంటేనే సంబంధిత పత్రాలు లేవంటూ విద్యాశాఖ అధికారులు కొర్రీలు పెట్టి నెలల తరబడి విద్యాశాఖ కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తెప్పిస్తారు. కానీ టెక్నాలజీ పరంగా ఉన్నతమైన విద్యావంతులను తయారుచేసి కళాశాలల ఏర్పాటుకు సరైన విచారణ లేకుండానే ఉన్నతాధికారులు అనుమతులు ఇచ్చారు. కానీ ఆలస్యంగా తప్పుడు ధృపత్రాలతో కాలేజీ ఏర్పాటయిందని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కాలేజ్ అనుమతి కోసం జరిగిన అక్రమాలు పుంఖానుపుంఖాలుగా బహిర్గతమవుతున్నాయి.

పూర్తి వివరాలలోకి వెళితే..

2007వ సంవత్సరంలో కాకతీయ ఎడ్యుకేషనల్ సొసైటీ ( రి.నెం. 3137/88) చైర్మన్ నీలా సత్యనారాయణ పేరుతో పూర్వపు నల్లగొండ జిల్లా, ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలోని కోదాడ పట్టణంలో కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ ( కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కాలేజీ) పేరుతో జేఎన్టీయూ, ఏఐసిటిఈ లకు ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటుకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ఈ క్రమంలో 10-29 ఎకరాల భూమి కాలేజీ కోసం ఉన్నట్లు అధికారులకు చూపించారు. అందులో 339,259, 287, 288, 289 సర్వే నెంబర్ లలో 2-08 ఎకరాల భూమి ఉందని డాక్యుమెంట్ నెంబర్ 9309/ 2007లో చూపించారు. అదే గాకుండా సర్వే నెంబర్ 259, 288, 338, 339 లలో మరోక 8-21 ఎకరాల భూమిని డాక్యుమెంట్ నెంబర్ 9289/2007 ఉన్నట్లుగా ఉన్నత విద్యామండలికి సమర్పించారు..

ఫోర్జరీ ధ్రువీకరణ పత్రాలతో..!

కళాశాల ఏర్పాటు చేయాలంటే ఉన్నత విద్యా మండలి నిబంధనల ప్రకారం కావలసినంత భూమి, భవనం ఉండాల్సిందే. కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ కోసం 10-29ఎకరాల భూమి ఉందని, భూమిలో భవన నిర్మాణాల కోసం రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి నాలా సర్టిఫికెట్ తీసుకున్నట్లు ఉన్నత విద్యా మండలికి సమర్పించారు. కానీ 10--29 ఎకరాల భూమిని కాకతీయ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో రిజిస్టర్ చేసినట్లు డాక్యుమెంట్లు, అంతే కాకుండా నాలా సర్టిఫికెట్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకున్నట్టు చూపించారు.

ఈ రెండు సర్టిఫికెట్లు కూడా పూర్తిగా ఫోర్జరీ సంతకలతో ఉన్నాయని అధికారులు ఆలస్యంగా గుర్తించారు. పది ఎకరాలు 29 గుంటల భూమి కోదాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ కాలేదని, అలా సర్టిఫికెట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వలేదని స్వయంగా సంబంధిత శాఖ అధికారులు పోలీస్ అధికారులకు లిఖితపూర్వకంగా సమాచారం అందజేశారు.

అక్రమాలపై ఫిర్యాదు..!

కోదాడ పట్టణంలో ఉన్న కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అక్రమాలపై 2021 సంవత్సరంలో కెపిబివి కుమార్, 2022 లో జి రమణారెడ్డి, 2023సం.లో డాక్టర్ బట్టు శ్రీహరి జేఎన్టీయూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అక్రమాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కళాశాల అక్రమాలపై విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక లెటర్ నోట్ 40, ( No.1151/V& E/D2/2023, తేది 8--10--2024 సమర్పించారని తెలిసింది .

అయినప్పటికీ ఇంతవరకు కూడా కళాశాలపై ఇలాంటి చర్యలు తీసుకోలేదని సమాచారం.

Next Story