కుక్కలను చంపితే శిక్ష త‌ప్ప‌దు : ప‌శు వైద్యాధికారి న‌రేష్

by Ratna Kumari |

కుక్కలను చంపితే శిక్ష ప‌డుతుంద‌ని తుంగతుర్తి మండల పశువైద్యాధికారి డాక్టర్ నరేష్ పేర్కొన్నారు.

కుక్కలను చంపితే శిక్ష  త‌ప్ప‌దు : ప‌శు వైద్యాధికారి న‌రేష్
X

దిశ, తుంగతుర్తి : కుక్కలను చంపితే శిక్ష ప‌డుతుంద‌ని తుంగతుర్తి మండల పశువైద్యాధికారి డాక్టర్ నరేష్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని వెలుగుపల్లి, వెంపటి గ్రామాలలో కుక్కల సామూహిక హత్య నివారణపై ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుక్కలను చంపడం ఐపిసి 428/429 ప్రకారం నేరమన్నారు. వీధి కుక్కల సంఖ్యను తగ్గించడానికి స్టెరిలైజేషన్ (నిస్సంతా నీకరణ) మాత్రమే ఉత్తమ మార్గమని వివరించారు. గ్రామపంచాయతీలు, ఎన్జీవోలు, దాతల సహకారంతో గ్రామాలలో నిస్సంతానీకరణ కోసం ముందుకు వస్తే పశువైద్య శాఖ సహకరిస్తుందని తెలిపారు. ప్రతి ఆరు మాసాలకు ఒకసారి కుక్కలకు పిచ్చి లేవకుండా రేబిస్ టీకాలు వేయించుకోవాలి, వీధి కుక్కలలో గజ్జి నివారణకు ఐవర్ మెక్టిన్ అనే టాబ్లెట్ వాడాలని సూచించారు. కార్యక్రమంలో వెలుగు పల్లి గ్రామ సర్పంచ్ సోలిపురం అశ్విని కన్నా రెడ్డి,ఉప సర్పంచ్ పసునూరి సాయికుమార్, పంచాయతీ సెక్రెటరీ, సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Next Story