- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రత్యూష IAS స్కాండల్.. మోసాల వెనుకున్న నిజం బయటకు..!
తాను ఐఏఎస్ అధికారినంటూ పలువురు యువకులను మోసగించిన కిలాడీ లేడీ గుట్టురట్టయింది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

దిశ, నల్లగొండ క్రైం: తాను ఐఏఎస్ అధికారినంటూ పలువురు యువకులను మోసగించిన కిలాడీ లేడీ గుట్టురట్టయింది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం లావుడి తండాకు చెందిన సరిత అలియాస్ డాక్టర్ ప్రత్యూష ఐఏఎస్‌గా చలామణీ అవుతూ యువకులను మోసం చేసి డబ్బు వసూలు చేస్తోంది. గతంలో ఆమె విద్యార్థిని ముసుగులో హాస్టల్లో ఉంటూ తోటి యువతుల సెల్ ఫోన్లు, నగదు దొంగిలించేది. కొంతకాలంగా డబ్బున్న వారిని టార్గెట్ చేస్తూ తాను డాక్టర్, ఐఏఎస్, డీఎస్పీ కూతురు అంటూ రకరకాల పదవులను వాడుకుని యువకులను మోసం చేస్తోంది.
ఏడాది క్రితం ఒక వైద్యుడిని బెదిరించి రూ.5 లక్షలు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. మరో యువకుడిని డబ్బు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించి, నగదు వసూలు చేసిందని బాధితులు పేర్కొంటున్నారు. మూడు రోజుల క్రితం డైల్ 100 ద్వారా పోలీసులకు ఫోన్ చేసి తాను డీఎస్పీ సతీమణిని అంటూ ఒకసారి, యువతి హత్య జరిగిందని మరోసారి పోలీసులను ఆటపట్టించింది. ఇప్పటికే సరిత పైన చైతన్యపురి, ఉప్పల్, నల్లగొండ టూ టౌన్, మిర్యాలగూడ వన్ టౌన్, నార్కెట్ పల్లి, నల్గొండ పోలీస్ స్టేషన్లలో చోరీ కేసులు నమోదు చేశారు.
అయితే రెండు రోజుల క్రితం ఓ చోరీ కేసులో సరితను అరెస్టు చేయడంతో, వాస్తవాలు బయటపడ్డాయి. దీంతో నిందితురాలిని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అయితే మరోసారి ఆమెను కస్టడీకి తీసుకుని విచారణ నిర్వహించే అవకాశం కనపిస్తోంది. ఎక్కెక్కడ ఆమె మోసాలకు పాల్పడింది. ఐఏఎస్ ను అని చెప్పుకుంటూ ఎంతమంది దగ్గర నగదు వసూలు చేసిందో తెలియాల్సి ఉంది.






