- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరేళ్ల తర్వాత పునఃప్రారంభమైన కన్నయ్యబావి తండా పాఠశాల
by Kodari Anjali |
కనగల్ మండలంలోని ఇస్లాంనగర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న కన్నయ్యబావి తండా ప్రాథమిక పాఠశాల ఆరు సంవత్సరాల తర్వాత పునఃప్రారంభమైంది.

X
దిశ, కనగల్: కనగల్ మండలంలోని ఇస్లాంనగర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న కన్నయ్యబావి తండా ప్రాథమిక పాఠశాల ఆరు సంవత్సరాల తర్వాత సోమవారం పునఃప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి వి.పద్మ, గ్రామ సర్పంచ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంఈఓ పద్మ మాట్లాడుతూ.. సర్వతోముఖాభివృద్ధికి విద్య ఎంతో ముఖ్యమని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి బడి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల నాయకులు బోయపల్లి జానయ్య గౌడ్, ఉపాధ్యాయులు శ్రీరాములు, సీఆర్పీ సంపూర్ణ, అంగన్వాడీ టీచర్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Next Story






