- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాలీవుడ్‌లో గోల్డెన్ చాన్స్ దక్కించుకున్న ప్రీతి ముకుందన్.. శర్వానంద్‌తో రొమాన్స్!
ఇప్పుడు లక్కీగా చార్మింగ్ స్టార్ శర్వానంద్, డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబోలో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుందని సమాచారం.

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ బ్యూటీ ప్రీతిముకుందన్ శ్రీవిష్ణు సూపర్ హిట్ చిత్రం ‘ఓం భీమ్ బుష్’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరచయం అయ్యారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లోనూ కీలక పాత్రలో నటించి మెప్పించారు. రీసెంట్‌గా ‘బ్లాస్ట్’ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ కూతురిగా కనిపించి తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ప్రీతి ముకుందన్ తెలుగు, తమిళ, మలయాళ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. తాజాగా, ఈ అమ్మడుకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు లక్కీగా చార్మింగ్ స్టార్ శర్వానంద్, డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబోలో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రంలో హీరోయిన్‌గా గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుందని సమాచారం.
వైవిధ్యమైన పాత్రలు, తన క్యూట్ లుక్స్, నటనతో కుర్రకారు మనసులు దోచుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌లో భాగం కావడం విశేషం. సాధారణంగా శ్రీను వైట్ల సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు ఎంతో గ్లామరస్‌గా, బబ్లీగా ఉంటూనే.. కథలో చాలా కీలకంగా ఉంటాయి. అలాంటి ఒక ప్రాధాన్యత ఉన్న రోల్‌లో ప్రీతి ముకుందన్ ఎంపిక కావడం ఆమె కెరీర్‌కు టాలీవుడ్‌లో గట్టి పునాది వేస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం శర్వానంద్ తన ‘భోగి’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన వెంటనే, వచ్చే ఆగస్టు నుండి ఈ క్రేజీ ఎంటర్‌టైనర్ సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్.ఈ చిత్రానికి ‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.






