కబడ్డీ పోటీలు విజయవంతం చేయాలి

by Nallavelli.Anjaneyulu |

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నిర్వహించనున్న కబడ్డీ పోటీలను విజయవంతం చేయాలని సంస్థాన్ నారాయణపురం నేతాజీ యువజన సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు దేశిడి నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.

కబడ్డీ పోటీలు విజయవంతం చేయాలి
X

దిశ, సంస్థాన్ నారాయణపురం : నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నిర్వహించనున్న కబడ్డీ పోటీలను విజయవంతం చేయాలని సంస్థాన్ నారాయణపురం నేతాజీ యువజన సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు దేశిడి నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నేతాజీ జయంతి సందర్భంగా కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈనెల 21న సాయంత్రం లోపు పోటీలలో పాల్గొనేవారు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. 22, 23వ తేదీలలో కబడ్డీ పోటీలు నిర్వహించి 23 న సాయంత్రం నేతాజీ జయంతి సందర్భంగా బహుమతి ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు. యువకులలో స్ఫూర్తి నింపేందుకే ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు యువజన సమాఖ్య సభ్యులు తెలిపారు. ఈ క్రీడా పోటీలకు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదని కూడా వెల్లడించారు. ఈ సమావేశంలో నేతాజీ యువజన సమాఖ్య అధ్యక్షులు రుద్ర రాములు, ప్రధాన కార్యదర్శి పబ్బు మాదవులు, కట్ల పద్మాచారి, రాపర్తి సత్యనారాయణ, వీరమల్ల బాలరాజు,మాదగోని గోపాల్, బచ్చనబోని గాలయ్య, పందుల యాదగిరి,వీరమళ్ళ యాదయ్య,గుత్తా శేఖర్ రెడ్డి ముత్యాల అంజయ్య, గడ్డం యాది, పల్లె రాములు పాల్గొన్నారు.

Next Story