ఇష్టపడి చదవాలి: జూలకంటి

by S Gopi |

విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి మంచి ఫలితాలు సాధించాలని మాజీ ఎమ్మేల్యే జూలకంటి.. Julakanti Rangareddy Speech

ఇష్టపడి చదవాలి: జూలకంటి
X

దిశ, మిర్యాలగూడ: విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి మంచి ఫలితాలు సాధించాలని మాజీ ఎమ్మేల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన మోడల్ టెస్ట్ విజేతలకు మంగళవారం బహుమతి ప్రదానం చేసి మాట్లాడారు. వార్షిక పరీక్షల పట్ల భయం పోగొట్టేలా ఎస్ఎఫ్ఐ మోడల్ టెస్ట్ నిర్వహించడం అభినందనీయం అన్నారు. బీజేపీ ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతించి పేదలకు ఉన్నత విద్య దూరం చేస్తుందని, మత ప్రాతిపదికన అమలు చేసే నూతన విద్యా విధానాన్ని తిప్పి కొట్టాలని కోరారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మూడవత్ రవి నాయక్, మంగారెడ్డి, గౌతంరెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, శంకర్, సైదా, వదుద్, జగన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story