ప్రజల సమస్యల పరిష్కారం కోసమే జనం బాట : ఎమ్మెల్సీ కవిత

by Nallavelli.Anjaneyulu |

జనం కోసమే జాగృతి ఉందని ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జనం బాట నిర్వహిస్తున్నట్లు జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు.

ప్రజల సమస్యల పరిష్కారం కోసమే జనం బాట : ఎమ్మెల్సీ కవిత
X

దిశ, నూతనకల్ : జనం కోసమే జాగృతి ఉందని ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జనం బాట నిర్వహిస్తున్నట్లు జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. శనివారం ఆమె నూతనకల్ మండల కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు విద్యా ,వైద్య రంగాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. సూర్యపేట ప్రాంతం విప్లవాలకు పురిటి గడ్డ అని మారోజు వీరన్న, మల్లు స్వరాజ్యం, బండి యాదగిరి, తొట్ల మల్సూర్ లాంటి పోరాట యోధులు ఈ ప్రాంతం వారని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులను ప్రభుత్వము పట్టించుకోవడంలేదని అమరవీరులకు కోటి రూపాయలు అందజేస్తామని ఎన్నికల వాగ్దానంలో చేసిన మాటలను వట్టి మాటలు గా మిగిలాయని అన్నారు. వైద్య రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశారని నియోజకవర్గ కేంద్రంలోని హాస్పటల్లో సందర్శించినప్పుడు నెలలో రెండు డెలివరులు అవుతున్నాయని.. గత బిఆర్ఎస్ ప్రభుత్వం 100 పడకల హాస్పటల్ కు శంకుస్థాపన చేశారని, తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా రెండవసారి శంకుస్థాపన చేసిన పనులు ఇంకా కొనసాగుతున్నాయని ఆవేదన తెలిపారు.

ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని..

నూతనకల్ మండల కేంద్రంలో బస్సు షెల్టర్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా మహిళలు మరుగుదొడ్లు లేకపోవడంతో నాన ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానంను నెరవేర్చకుండా గద్దెనెక్కాగా వాటి అమలుకు నోచుకోవడం లేదని, నూతనకల్ మండల కేంద్రంలో కనీసం జూనియర్ కళాశాల లేకపోవడం, విద్య పట్ల వారికున్న నిర్లక్ష్య ధోరణి కనబడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చడానికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోరాడుతామని పిలుపునిచ్చారు.అనేక సంవత్సరాల సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా ఉన్న నూతనకల్ గడ్డ పోరుగడ్డ అని, ఇక్కడి మహిళలు ప్రతి ఒక్కరూ మల్లు స్వరాజ్యం లాగా కనపడుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా అధ్యక్షురాలు సూరారపు కృష్ణవేణి, నాయకుడు ఇస్మాయిల్, మహేష్, చిరంజీవి పాల్గొన్నారు.

Next Story