- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ నాయకులపైన అక్రమ కేసులు పెడితే సహించేది లేదు
బీఆర్ఎస్ నాయకులపైన పోలీసులు అక్రమ కేసులు పెడితే సహించేది లేదని మాజీమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.

దిశ, చివ్వేంల: బీఆర్ఎస్ నాయకులపైన పోలీసులు అక్రమ కేసులు పెడితే సహించేది లేదని మాజీమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఆదివారం దూరజ్ పల్లి లో సూర్యాపేట కౌన్సిలర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బాషా అక్రమ అరెస్టును ఖండిస్తూ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మీడియా తో మాట్లాడారు. తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తుందని, మంత్రులకు పాలన చేతకాక పోలీస్ లను ముందుపెడున్నారని ఆగ్రహించారు.
ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోలీసులను అడ్డుపెట్టుకొని పాలన సాగిస్తున్నారని తెలిపారు. యూరియా లైన్ వీడియో తీసి పెట్టినా కేసులు పెట్టడం దుర్మార్గం అని మండిపడ్డారు. అర్ధం లేని కేసులో అర్ధరాత్రి అరెస్టులు అక్రమం అన్నారు.
మాజీ కౌన్సిలర్ ను ఓ తాగుబోతు ఇచ్చిన పిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేయడం దుర్మార్గం అంటూ ఆగ్రహించారు. ప్రజల ఒత్తిడితోనే ఈరోజు పోలీసులు తలొగ్గి మాజీ కౌన్సిలర్ భాషను పోలీసులు విడిచిపెట్టడం జరిగిందని తెలిపారు.ఇక జగదీశ్ రెడ్డి వెంట మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జూలకంటి జీవన్ రెడ్డి, ఉప్పల ఆనంద్, గుర్రం సత్యనారాయణ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ఉన్నారు.






