‘అలా జరగక పోవడం దురదృష్టకరం’.. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2026-01-04 14:30:38  IST  )

అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి ఏ మాత్రం జరగలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

‘అలా జరగక పోవడం దురదృష్టకరం’.. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, హుజూర్ నగర్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు అవుతున్న ఇంకా ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందడం లేదని అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి ఏ మాత్రం జరగలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం హుజూర్ నగర్ పర్యటించి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ను సందర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హుజూర్ నగర్ నియోజకవర్గం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు కనిపిస్తుందని ఇక్కడ ప్రాతినిధ్యం ఇస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివృద్ధి పై ఏ మాత్రం దృష్టి పెట్టలేదని విమర్శలు గుప్పించారు.

హాస్పిటల్ లో 50 మంది డాక్టర్ ఉండాల్సి ఉండగా కేవలం నలుగురు ఐదుగురు మాత్రమే కనిపిస్తున్నారని అలాగే స్టాఫ్ నర్స్ కూడా సరిగా లేరన్నారు. హుజూర్ నగర్ తో నాకు ప్రత్యేక అనుబంధం ఉందని ఇక్కడ ప్రతి అణువు అణువు నాకు తెలుసు అన్నారు. నియోజకవర్గం ఏర్పాటు అయ్యాక మంచి నాయకులు వస్తారేమో ఆశించానని అనుకుంటే అలా జరగక పోవడం దురదృష్టకరం అన్నారు. ఇక్కడి ఫ్యాక్టరీల్లో స్థానిక యువకులకు ఉద్యోగాలు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ప్రజల జీవన ప్రమాణాలు ఏ మాత్రం మారడం లేదన్నారు. హుజూర్ నగర్ పట్టణంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మొదలు పెట్టిన ఇండ్ల నిర్మాణం ఇప్పటివరకు జరగక పోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

అసెంబ్లీలో నీళ్ల గురించి చర్చ జరిగితే ఆలమట్టి ఎత్తు గురించి ప్రశ్నించలేదని అలాగే తుంగభద్ర గురించి ప్రశ్నించలేదని కృష్ణ నది జలాలను కాపాడటంలో విఫలం అవుతున్నారని అన్నారు.నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సరైన మెయింటెన్స్ లేదని విమర్శించారు.ఇక్కడ లిఫ్ట్ పైనే ఆధారపడి వున్న రైతులకు 58 లిఫ్ట్ లు ఉన్నప్పటికీ కేవలం 17 లిఫ్ట్ లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపారు.మొన్నటి వరకు నూతనంగా నిర్మిస్తున్న లిఫ్ట్ కు వ్యతిరేకంగా ఉన్న ఉత్తమ్ ఇప్పుడు దాని బడ్జెట్ పెంచి నిర్మాణానికి సహకరించడం వెనుక అంతర్యం ఏమిటని ఉత్తమ్ కు ఏమైనా వాటాలు అందాయ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు చేస్తామని చెప్పిన హామీలన్నీ తుంగలో తొక్కారన్నారు. రాబోయే రోజుల్లో జాగృతి ప్రజల పక్షాన నిలబడుతుందన్నారు.

Read More : బీఆర్ఎస్‌లో హరీష్ రావుకు సపరేట్ గ్రూప్: Kalvakuntla Kavitha

Next Story