- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
రాజకీయ కుట్రలో భాగమే ఐటి దాడులు.. ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి
by Disha Web Desk 20 |

X
దిశ, యాదాద్రి కలెక్టరేట్ : రాజకీయ కుట్రలో భాగంగానే తన పై ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగాయని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి అన్నారు. శనివారం ఐటీ దాడుల తర్వాత తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. మూడు రోజులుగా తనిఖీలు చేపట్టిన అధికారులు తన కంపెనీలు, వాటి ఆర్థిక లావాదేవీల పై వివరాలు తీసుకున్నారన్నారు.
తొలిరోజు గంటన్నరలోపే ఐటీ దాడులు పూర్తియిన కావాలనే 3 రోజులు ఇబ్బంది పెట్టారన్నారు. వారికి అనునకూలమైన సమాచారం లభించక పోవడంతో ఏమి చేయలేకపోయారని అన్నారు. ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారని, ఎప్పుడు విచారణకు పిలిచినా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని శేఖర్ రెడ్డి తెలిపారు. గత మూడు రోజులుగా అండగా నిలిచిన కార్యకర్తలు, నాయకులు, ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
Next Story