- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సబ్బండ వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మాయమాటలతో సబ్బండ వర్గాల ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటుందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.

దిశ, చండూరు : మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మాయమాటలతో సబ్బండ వర్గాల ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటుందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం చండూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా లో ఇద్దరు మంత్రులు ఉన్నా అభివృద్ధి మాత్రం కనిపించడం లేదన్నారు. తెలంగాణ ఇంజనీర్లు తయారు చేసిన డీపీఆర్ ఆమోదిస్తే తెలంగాణలోని మునుగోడు ప్రాంతంలోని శివన్నగూడెం, కిష్టరాంపల్లి ప్రాజెక్టు, నక్కలగండి కి నీళ్లు రావడంతో నల్లగొండ జిల్లా సస్యశ్యామలం అయ్యేదన్నారు. కృష్ణా జలాల విషయంలో ప్రభుత్వం సమగ్ర విషయాలతో సుప్రీంకోర్టుకు వెళ్లకుండా అవగాహన లోపంతో తప్పుడు సమాచారం ఇస్తే సుప్రీంకోర్టు తిరస్కరించిందన్నారు. తెలంగాణలో నీటి సమస్య తీరాలంటే రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావాల్సిన అవశ్యకత ఉందని.. అది కెసిఆర్ తోనే సాధ్యమవుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పునరాలోచిస్తున్నారని అందుకే మొన్నటి సర్పంచ్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కటారన్నారు. నేడు ప్రభుత్వ సలహాదారులుగా చంద్రబాబు మనుషులు ఉన్నారని దీంతో రాష్ట్రంలో నేడు జలదోపిడి జరుగుతుందన్నారు. ఇక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి సాగునీటి పై రోడ్లపై ఎలాంటి అవగాహన లేదన్నారు. ఆయనకు మంత్రి పదవీ పై ఉన్న ధ్యాస అభివృద్ధిపై లేదన్నారు. మంత్రి పదవి వచ్చేది తెలువదు. కానీ నిత్యం మంత్రి పదవి స్మరణతో నియోజకవర్గం ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారన్నారు.
చండూరు, చౌటుప్పల్ మున్సిపాలిటీలతోపాటు చండూరు రెవిన్యూ డివిజన్ గా తానే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంతాన్ని అనేక విధాలుగా నేను అభివృద్ధి చేస్తే.. ఆయన చేసినట్లు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరమన్నారు . రాజగోపాల్ రెడ్డి పద్నాలుగు సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉండి నియోజకవర్గంలోని ఏ ఒక్క గ్రామానికి కూడా అభివృద్ధి పనిచేయలేదని అన్నారు. చేసిన పనులకు బిల్లులు ఇచ్చే దిక్కులేదు కానీ రానున్న రెండు సంవత్సరాలలో అభివృద్ధి చేస్తాను అనడం సిగ్గుచేటు అన్నారు. ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి వనులను ప్రజలకు వివరిస్తూ రానున్న మున్సిపల్ ఎన్నికలకు కార్యకర్తలు సమయత్తం కావాలని సూచించారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొత్తపాటి సతీష్ , మున్సిపల్ మాజీ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న , మండల పార్టీ అధ్యక్షుడు వెంకన్న, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మునగాల నారాయణరావు,ఎత్తపు మధుసూదన్ రావు,అధికార ప్రతినిధి బొడ్డు సతీష్ గౌడ్ ,చండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుర్రం మాధవి వెంకటరెడ్డి, యువజన అధ్యక్షులు ఉజ్జిని అనిల్ రావు,టి ఆర్ఎస్ మండల నాయకులు రావిరాల నగేష్,ఈరిగి రామన్న, జగదీష్ పాల్గొన్నారు.






