ఓడిన వారి పైసలు ఉంచుకుంటే పాపం

by Ratna Kumari |

దిశ‌, తుంగ‌తుర్తి : ఎన్నిక‌ల్లో ఓట‌ర్ల‌కు పంచిన డ‌బ్బులు అభ్య‌ర్థులు ఓడినా, గెలిచినా తిరిగి రావు. ఈ మేరకు ఇచ్చిన

ఓడిన వారి పైసలు ఉంచుకుంటే పాపం
X

దిశ‌, తుంగ‌తుర్తి : ఎన్నిక‌ల్లో ఓట‌ర్ల‌కు పంచిన డ‌బ్బులు అభ్య‌ర్థులు ఓడినా, గెలిచినా తిరిగి రావు. ఈ మేరకు ఇచ్చిన డబ్బులను దాచుకోవడమో లేక ఖర్చు చేసుకోవడమో లాంటివి చేసుకుంటారు. ఇదంతా మామూలే. పైగా గొప్ప విషయం కూడా కాదు. కానీ తీసుకున్న డబ్బులు ఓటమి పాలైన అభ్యర్థికి స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చేయడం ఎక్కడైనా చూసామా..? అంతేకాదు ఓటమి పాలైన అభ్యర్థి బాధలో ఉంటే తీసుకున్న డబ్బును ఇవ్వకపోతే పాపం తలుగుతోందంటూ...! ఓటర్లు ఈ పనికి పూనుకున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం మానాపురం గ్రామంలో ఈ సంఘటన జ‌రిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్‌ గా పోటీ చేయడానికి పలువురిలో పోటీ ఏర్పడింది. ఈ మేరకు బానోతు నాగమ్మ రామకోటి, లకావత్ తార శేఖర్ లు పోటీ దిగారు. గెలవడానికి తీవ్రస్థాయిలో కష్టపడ్డారు. డబ్బులతో ఓటర్లను మచ్చిక చేసుకున్నారు. చివరికి ఫలితాల్లో తార శేఖర్ ఓటమి పాలయ్యారు. ఇంత ఖర్చు పెట్టుకున్నా ఓటమిపాలైతిమే అనే బాధతో కుమిలిపోయారు. ఈ క్రమంలో కొంతమంది ఓటర్లు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోతే పాపం తగులుతుందంటూ ముందుకొచ్చి ఇచ్చేశారు. పైగా తామంతా ఓటేసినప్పటికీ గెలవలేక పోయారే అంటూ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

Next Story