- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ టెండరింగ్..?
దేవరకొండ నియోజకవర్గం లోని కొండమల్లేపల్లి డివిజన్ లో సమ్మర్ ప్లానింగ్ కింద ఎనిమిది పనులకు విద్యుత్ అధికారులు అంచనాలు వేశారు.

దేవరకొండ నియోజకవర్గం లోని కొండమల్లేపల్లి డివిజన్లో సమ్మర్ ప్లానింగ్ కింద ఎనిమిది పనులకు విద్యుత్ అధికారులు అంచనాలు వేశారు. వాటి విలువ సుమారు రూ. 40 లక్షలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. కమీషన్లకు కక్కుర్తి పడి కాంట్రాక్టర్లను రింగయ్యేలా ప్రోత్సహించింది అధికారులేనని సమాచారం. ఎనిమిది పనులను ఒకే కాంట్రాక్టర్కు ఒక్క శాతం చొప్పున అగ్రిమెంట్ చేయించడం దానికి ప్రతిఫలంగా 15 శాతం కమీషన్ అధికారులకు ముట్టచెప్పేలా ఒప్పందం చేసుకున్నారని సమాచారం.
దిశ , నల్లగొండ బ్యూరో : ఏ ప్రభుత్వ శాఖలో నైనా జరిగే అభివృద్ధి పనులకు టెండర్లు పెడితే కాంట్రాక్టర్లు రింగ్ అవడం జరుగుతుంది. కానీ ఆ శాఖలో మాత్రం అధికారులే కాంట్రాక్టర్లు ను రింగ్ చేసి పబ్బం గడుపుకుంటున్నారు. కాసులకు కక్కుర్తి పడి అధికారులు ఇష్టారాజ్యంగా ఆటలాడుతున్నారు. కాంట్రాక్టర్ల మధ్య లోకల్.... నాన్ లోకల్ గొడవలు సృష్టించి తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకుంటున్నారు. ఆ డివిజన్లో ఇద్దరు కాంట్రాక్టర్లు పెత్తనం చెలాయిస్తూ అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రూ. 40 లక్షల విద్యుత్ పనులు
దేవరకొండ నియోజకవర్గం లోని కొండమల్లేపల్లి డివిజన్లో సమ్మర్ ప్లానింగ్ కింద 8 పనులకు విద్యుత్ అధికారులు అభివృద్ధి పనులకు అంచనాలు వేశారు. వాటి విలువ సుమారు రూ. 40 లక్షలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఎనిమిది పనుల కోసం టెండర్లు దాఖలు చేయడానికి జనవరి 17 ( శనివారం)న చివరి తేది. సమ్మర్లో విద్యుత్ సమస్యలు రాకుండా ఉండేందుకు అధికారులు ముందస్తుగా ప్రయాణికులు వేసి ఎక్కడైతే విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందో అక్కడ యుద్ధ ప్రాతిపదికన తికపదికన పనులు పూర్తి చేసేందుకు ఈ పనులు చేపట్టినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ పనులు ఒకటి నాంపల్లి, రెండు మర్రిగూడ, ఒకటి కొండమల్లేపల్లి, మూడు గుర్రంపోడు, ఒకటి నేరేడు గొమ్ము మండలాలకు పనులు కేటాయించారు. ఒక్కొక్క పని రూ. 2.23 లక్షల నుంచి 6.64లక్షల వరకు నిధులు వినియోగించనున్నారు.
రింగ్ మాస్టర్ అధికారులే....
రూ.40 లక్షల విలువైన పనులను ఒక్కరికే కట్టబెట్టేందుకు అధికారులే చెరువు చేసుకుని కాంట్రాక్టర్లను రింగ్ చేసినట్లు సమాచారం. కమీషన్లకు కక్కుర్తి పడి కాంట్రాక్టర్లను రింగయ్యేలా ప్రోత్సహించింది అధికారులేనని సమాచారం. ఎనిమిది పనులను ఒకే కాంట్రాక్టర్కు ఒక్క శాతం చొప్పున అగ్రిమెంట్ చేయించడం దానికి ప్రతిఫలంగా 15 శాతం కమీషన్ అధికారులకు ముట్టచెప్పేలా ఒప్పందం చేసుకున్నారని సమాచారం. ఇదిలా ఉంటే ఆ ఎనిమిది పనులను కొండమల్లేపల్లిలో ఉన్న కాంట్రాక్టరు అందరూ సబ్ లీజుకు పంపిణీ చేసేలా అధికారులే ఒప్పందం కుదిరించినట్లు సమాచారం. దీంతో ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు ఆ టెండర్లలో పాల్గొనకుండా అడ్డుకునేలా కాంట్రాక్టర్ల చేత ప్లాన్ చేసింది కూడా అధికారులేనని తెలుస్తుంది. విద్యుత్ కార్యాలయం ముందు గొడుగు జరుగుతున్నంత సేపు విద్యుత్ అధికారి అక్కడే ఉండి కనీసం దాన్ని నివారించే ప్రయత్నం చేయలేదంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తం ఎపిసోడ్ లో డివిజన్ విద్యుత్ అధికారి, విద్యుత్ టెక్నికల్ అధికారి ప్రధాన పాత్ర పోషించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
టెండర్ కు ముందే మెటేరియల్ అప్పగింత ?
ప్రస్తుతం టెండర్లు వేసిన ఎనిమిది పనులకు సంబంధించిన మెటీరియల్ ముందస్తుగానే ఓ కాంట్రాక్టర్కు అప్పగించి పనులు మొదలు పెట్టినట్లు సమాచారం. అయితే టెండర్ లేకుండా పనులు ఎలా అప్పగిస్తారని.. ప్రశ్న తలెత్తితే తన ఉద్యోగానికే ప్రమాదం వచ్చే అవకాశం ఉందని అధికారులు కుట్ర చేశారని సమాచారం. సంబంధిత శాఖలో పనిచేసే ఓ సెక్షన్ అధికారికి కాంట్రాక్టర్ కు ఉన్న బంధుత్వం వల్లే టెండర్ కి ముందే పనులు అప్పగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం కొండమల్లేపల్లి డివిజన్లో ఓ ఇద్దరు కాంట్రాక్టర్ల పెత్తనం కొనసాగుతుందని దానివల్లే ఇతర కాంట్రాక్టర్లకు కనీసం ఏడాదికి ఒకటి రెండు పనులు కూడా దక్కే అవకాశం లేకుండా పోయిందని అక్కడి కాంట్రాక్టర్లే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






