ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి : క‌లెక్ట‌ర్ ఇలా త్రిపాఠి

by Nallavelli.Anjaneyulu |

దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో SLBC కాలనీ వద్ద చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్

ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి : క‌లెక్ట‌ర్ ఇలా త్రిపాఠి
X

దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో SLBC కాలనీ వద్ద చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను త్వ‌ర‌గా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం ఆమె యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించారు. వచ్చే విద్యా సంవత్సరం అకాడమీ జూన్ లో ప్రారంభమయ్యే నాటికి తరగతి గదులు, విద్యార్థులు ఉండేందుకు డార్మెట్రీ, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఎంట్రన్స్ గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్, త్రాగునీరు, ఆట స్థలాల తో సహా పూర్తి చేయాలని ఇంజనీర్, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన‌ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని, పనులు నాణ్యత ప్రమాణాలతో ఉండాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, దీనిని దృష్టిలో ఉంచుకొని పాఠశాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేలా చూడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. క‌లెక్ట‌ర్ వెంట‌ నల్గొండ ఆర్డీవో వై.అశోక్ రెడ్డి, నల్గొండ తహశీల్దార్ పరుశురాం ఉన్నారు.

Next Story