- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు : కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి
దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : నల్గొండ పట్టణంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని నల్గొం

దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : నల్గొండ పట్టణంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ పట్టణంలోని 7వ వార్డు లూయిస్ నగర్ లో నల్గొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ స్థానిక వార్డు ఇన్ చార్జి గుండగోని సాయితో కలిసి ఓర్సు శ్రీను - నర్సమ్మ దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్లగొండ నియోజకవర్గంలో 3,500 ఇండ్లు మంజూరు కాక నల్లగొండ పట్టణంలోనే 550 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని అన్నారు. 70 శాతం ఇండ్లు నిర్మాణ దశలు ఉన్నాయని, ఇవన్నీ రెండు నెలల్లో పూర్తి అవుతాయని తెలిపారు.
నూతనంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకొని గృహప్రవేశం చేసిన శ్రీను- నర్సమ్మ దంపతులను అభినందించారు. నల్గొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మాట్లాడుతూ లూయిస్ నగర్ లో ఓర్సు శ్రీను-నరసమ్మ దంపతులు తమకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని ఎంతో అందంగా నిర్మించుకున్నారని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు అపోహలు వీడి ఒకసారి లూయిస్ నగర్ లో ఓర్సు శ్రీను దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని సందర్శించాలని సూచించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతుందని పేర్కొన్నారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే నల్గొండ మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వజ్జ రమేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాబా, కత్తుల కోటి,ఖలీల్, ఎండి జావిద్, యాదయ్య, పిల్లి రమేష్ యాదవ్, అశోక్, పాదం అనిల్, యువజన కాంగ్రెస్ నాయకులు గాలి నాగరాజు, మామిడి కార్తీక్, కంచర్ల ఆనంద్ రెడ్డి పాల్గొన్నారు.






