కాంగ్రెస్ పార్టీ కాదని ఇందిరమ్మ ఇళ్ళు రద్దు.. అర్హులను అనగదొక్కి.. కాంగ్రెసోళ్లకే

by Bhanu |

తాను కాంగ్రెస్ పార్టీ కాదని తమకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లును రద్దు చేశారంటూ ఓ మహిళ గోడు వెళ్ళబోసుకుంటుంది.

కాంగ్రెస్ పార్టీ కాదని ఇందిరమ్మ ఇళ్ళు రద్దు.. అర్హులను అనగదొక్కి.. కాంగ్రెసోళ్లకే
X

దిశ, భూదాన్ పోచంపల్లి: తాను కాంగ్రెస్ పార్టీ కాదని తమకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లును రద్దు చేశారంటూ ఓ మహిళ గోడు వెళ్ళబోసుకుంటుంది. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని ఇంద్రియాల గ్రామంలో చోటుచేసుకుంది. బాధితురాలు పర్వతం భార్గవి తెలిపిన వివరాల ప్రకారం ..ఇంద్రియాల గ్రామానికి చెందిన పర్వతం రాజేష్ భార్గవి దంపతులు గ్రామంలో నలుదిక్కుల ఇనుప రేకులతో ఇల్లును ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు.

అయితే గ్రామానికి మొత్తం 34 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, అందులో తన పేరు ఉందని చెప్పింది. దీంతో మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శి తమ ఇంటికి వచ్చి సర్వే చేసి మీకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిందని చెప్పారు. కానీ అంతలోనే ఊహించని విషయం తెలిసిందని భార్గవి గోడు వెల్ల పోసుకుంటుంది.

అసలు సంగతి ఏంటంటే తన భర్త అయిన పర్వతం రాజేష్ బిఆర్ఎస్ పార్టీకి చెందిన వాడనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ వాళ్లు కక్షపూరితంగా ఇల్లు రద్దు చేయించారని వాపోతోంది. అదేవిధంగా గ్రామానికి చెందిన పోవనపు నందయ్య మల్లమ్మ వృద్ధ దంపతులు పూరి గుడిసెలో నివాసముంటున్నారు. అర్హులకు కాదని అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం ఎంతవరకు సమంజసం అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Next Story