పీఎన్ఎం జిల్లా మహాసభల కరపత్రం ఆవిష్కరణ

by Ratna Kumari |

దిశ, తిరుమలగిరి : ప్రజానాట్యమండలి జిల్లా మహాసభలు డిసెంబర్ 4, 5 తేదీల్లో జిల్లా కేంద్రంలో జరగనున్నాయని తుంగతుర్తి డివిజన్ కార్యదర్శి బూర్గుల ప్రభాకర్ తెలిపారు. బుధవారం తాటిపాముల

పీఎన్ఎం జిల్లా మహాసభల కరపత్రం ఆవిష్కరణ
X

దిశ, తిరుమలగిరి : ప్రజానాట్యమండలి జిల్లా మహాసభలు డిసెంబర్ 4, 5 తేదీల్లో జిల్లా కేంద్రంలో జరగనున్నాయని తుంగతుర్తి డివిజన్ కార్యదర్శి బూర్గుల ప్రభాకర్ తెలిపారు. బుధవారం తాటిపాముల గ్రామంలో మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “కళ కళ కోసం కాదు… ప్రజల కోసం కళ, ప్రజా ప్రగతి కోసం కళ” అనే నినాదంతో ప్రజానాట్యమండలి సాంస్కృతిక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తోందన్నారు. సాక్షరతా ఉద్యమం, సారా నిషేధం, మహిళ సాధికారత, నీటి కాలుష్య నిరోధం వంటి అనేక ప్రజా ఉద్యమాల్లో సంస్థ పోషించిన పాత్రను గుర్తుచేశారు. గ్రామీణ కళాకారులు, వృత్తి కళాకారులకు ప్రభుత్వాలు చేయూతనివ్వాల‌ని డిమాండ్ చేశారు. డిసెంబర్ 4, 5 మహాసభలను ప్రజలు, ప్రజాతంత్రవాదులు, కళాకారులు అధిక సంఖ్యలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కారుపోతుల అంజన్న సతీమణి పద్మ, పీఎన్ఎం నాయకులు మచ్చ నర్సయ్య, కందుకూరి రవి, కొమ్ము సోమయ్య, ఎర్ర రవి, బందెల అబ్రహం, ఆర్. వెంకటయ్య పాల్గొన్నారు.

Next Story