- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విహార యాత్రల పేరిట.. విధులకు డుమ్మా..!
చింతపల్లి మండల పరిధిలోని తీదేడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెడ్మాస్టర్, టీచర్లు విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరించినట్టు సమాచారం.

దిశ, చింతపల్లి : చింతపల్లి మండల పరిధిలోని తీదేడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెడ్మాస్టర్, టీచర్లు విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరించినట్టు సమాచారం. ఉన్నతాధికారుల అనుమతులు లేకుండా వర్కింగ్ డే లో విద్యార్థులను విహార యాత్ర లకు తీసుకెళ్లారని.. ఈ విషయం పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు గురువారం జిల్లా కలెక్టర్ చంద్ర శేఖర్, డీఈఓ బిక్షపతి, ఎంఈఓ అంజయ్య లకు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ తీదేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొత్తం 96 మంది విద్యార్థులు ఉండగా.. అందులో 40 మంది విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అధికారుల ఆదేశాలు లేకుండా విహారయాత్రకు తీసుకెళ్లారని తెలిపారు. విహారయాత్ర సమయంలో పాఠశాలలో కేవలం ఒక సైన్స్ టీచర్, ఒక పార్ట్ టైమ్ ఇన్‌స్ట్రక్టర్ మాత్రమే మిగిలారని, అందులో 28, 29 న సైన్స్ టీచర్ సెలవు పెట్టడంతో పార్ట్ టైం టీచర్, సీఆర్పీ తో స్కూల్ కొనసాగిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం పదవ తరగతి విద్యార్థులకు ఈ నెల 29నుంచి అన్వల్ ఫ్రీ ఫైనల్ టెస్ట్ ఎక్షామ్స్ నిర్వహించగా పరీక్షలకు విద్యార్థులు హాజరు కాలేదన్నారు. సైన్స్ టీచర్ సెలవులో వున్నప్పుడు పాఠశాల ఇంచార్జి ఎవరు వ్యవరిచారు. ఇన్ చార్జి టీచర్ సెలవు ఎవరి అనుమతితో తీసుకున్నారు. ఇంచార్జి బాధ్యతలు ఎవరికీ అప్పగించారు. మధ్యాహ్న భోజనం వివరాలు స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ లో ఎందుకు నమోదు చేయలేదు. విహారయాత్రకు డీఈవో అనుమతి తీసుకున్నారా..? అనుమతి తీసుకున్నట్లయితే ఒకేసారి ఏడుగురు టీచర్లకు ఎలా అనుమతి ఇచ్చారు. ఆ రోజుల్లో టీచర్ల అటెండెన్స్ పరిస్థితి ఏమిటని వినతి పత్రంలో కోరారు. ఇది ప్రభుత్వ విద్యా వ్యవస్థకు, విద్యార్థుల భవిష్యత్తుకు తీవ్ర నష్టం కలిగించే విషయమని.. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెడ్మాస్టర్, సంబంధిత టీచర్లపై సమగ్ర విచారణ జరిపి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, కఠిన చర్యలు చేపట్టాలని వినతిపత్రం లో కోరినట్టు గ్రామస్థులు తెలిపారు.






