- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తరలింపు
దిశ, మాడుగుల పల్లి : మండలంలోని ఇందుగుల గ్రామపంచాయతీ ఎస్టీ రిజర్వేషన్ కావడం పట్ల అక్కడ ఎస్టీ అభ్యర్థులు లేకపోవడంతో గందరగోలం నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ

దిశ, మాడుగుల పల్లి : మండలంలోని ఇందుగుల గ్రామపంచాయతీ ఎస్టీ రిజర్వేషన్ కావడం పట్ల అక్కడ ఎస్టీ అభ్యర్థులు లేకపోవడంతో గందరగోలం నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎస్టీ కులాలకు చెందిన వారిని ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. చింతమల్ల కల్పన అలియా స్ రమావత్ కల్పన భర్త రాంప్రసాద్ లు కలిసి డిసెంబర్ 02న ఇందుగుల గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ ధరఖాస్తు చేయడం జరిగింది. డిసెంబర్ 03న స్క్రూట్నీ పరిశీలనకు హాజరు కావాల్సిందిగా అధికారులు నోటీసులు పంపించారు. తాను పరిశీలనకు వెళ్లగా అధికారులు అనుమతించకపోవడం పట్ల హైకోర్టును ఆశ్రయించింది. దీంతో స్థానిక ఎన్నికల అధికారులు తనను ఓటర్ లిస్ట్ లో తమ పేరును నమోదు చేయమని హైకోర్టు బెంచ్ కోర్ట్ ఆర్డర్ ఇప్పించినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహించారని గురువారం ఎంపీడీవో వంశిధర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రమావత్ కల్పన మాట్లాడుతూ నాకు పోటీ చేసే అవకాశం అర్హతలు ఉన్నప్పటికీ స్థానిక అధికారులు కావాలని నన్ను నామినేషన్ పత్రాలు పరిశీలనకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. ఆ నామినేషన్ తిరస్కరణకు గురైనందున దీనికి సంబంధించి పూర్తి వివరాలతో రాతపూర్వకంగా ఇవ్వాలని, లేనియెడల కోర్టును సంప్రదించి తగిన న్యాయం చేయాలని కోరనున్నట్టు ఆమె తెలిపారు. ఆమె వెంట డివైఎఫ్ఐ జిల్లా నాయకులు పుల్లెంల శ్రీకర్ ఉన్నారు.






