క్రమశిక్షణతో చదివితే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చు- దేవరకొండ డి.ఎస్.పి శ్రీనివాసరావు

by I. Sairam |

విద్యార్థులు క్రమశిక్షణతో పాటు ప్రణాళికాబద్ధంగా చదివితే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని దేవరకొండ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

క్రమశిక్షణతో చదివితే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చు- దేవరకొండ డి.ఎస్.పి శ్రీనివాసరావు
X

దిశ, మర్రిగూడ (నాంపల్లి) : విద్యార్థులు క్రమశిక్షణతో పాటు ప్రణాళికాబద్ధంగా చదివితే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని దేవరకొండ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం PRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాంపల్లి మండలం పెద్దాపురం ప్రభుత్వ ఆదర్శ పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ పంపిణీకి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ధర్మో రక్షతి రక్షితః, వృక్షో రక్షతి రక్షితః ఇంతకు ముందు లేని కొత్త పదం విద్యో రక్షతి రక్షితః అంటూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని, చెడు వ్యసనాలకు అలవాటు పడవద్దని, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని విద్యను సరియైన ఆయుధంగా చేసుకొని ముందుకు వెళ్లాలని తెలిపారు. పి ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చేల్లం పాండురంగారావు విద్యార్థుల కోసం వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం అన్నారు.

పాండురంగారావు లాంటి వారు అరుదుగా ఉంటారని వారి శ్రమను వారి పట్టుదలకు ప్రతిఫలంగా విద్యార్థులు మంచి ఫలితాలతో వారికి బహుమతిగా ఇవ్వాలని సూచించారు. గతంలో చదువుకునే సమయంలో పాఠశాలలో కనీస వసతులు కూడా లేవని ఐన కష్టపడి ఈ స్థాయికి చేరామని, క్రమశిక్షణతో చదివిన చదువు ప్రతి విద్యార్థిని ఉన్నత స్థానానికి చేరుస్తుందని తెలిపారు. ఇప్పుడు కష్టపడి చదివి తేనే మంచి ఫలితాలు వస్తాయని లక్ష్యం పెట్టుకుంటేనే భవిష్యత్తులో సంతోషంగా గౌరవంగా ఉంటామని ఆయన సూచించారు. నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ దూది రాజు పిఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చేల్లం పాండురంగారావు, పాఠశాల ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి చేతుల మీదుగా విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, రఘునందన్, సుమలత, బాల లింగమ్మ, కోటేష్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story