- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హద్దు దాటితే తాటతీస్తాం : కోదాడ సీఐ శివశంకర్
దిశ, కోదాడ : నూతన సంవత్సర వేడుకల పేరుతో అల్లర్లు, చట్టవ్యతిరేక చర్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని కోదాడ పట్టణ సీఐ శివశంకర్ బు

దిశ, కోదాడ : నూతన సంవత్సర వేడుకల పేరుతో అల్లర్లు, చట్టవ్యతిరేక చర్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని కోదాడ పట్టణ సీఐ శివశంకర్ బుధవారం హెచ్చరించారు. హద్దులు దాటితే తాటతీస్తామని ఆయన స్పష్టం చేశారు. డిసెంబర్ 31 రాత్రి నుంచి పట్టణంలో ప్రత్యేక పోలీసు బందోబస్తు, విస్తృత తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. అనుమతి లేకుండా డీజే సౌండ్ సిస్టమ్‌లు ఏర్పాటు చేయడం, అధిక శబ్దాలతో ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, రహదారులపై గుంపులు గుంపులుగా చేరడం వంటి చర్యలను సహించబోమన్నారు. ఇలాంటి ఘటనల్లో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం.. చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే ఏ చర్యనైనా ఉపేక్షించేది లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి సిఫారసులు పనిచేయవని సీఐ స్పష్టం చేశారు. నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని, పోలీసు ఆదేశాలకు సహకరించాలని ప్రజలకు ఆయన కఠిన హెచ్చరిక జారీ చేశారు.






