- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'నేను పవన్ కళ్యాణ్ అభిమానిని'.. నిధి అగర్వాల్ ఆసక్తకర వ్యాఖ్యలు
''నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని అని.. ఆయన తో 'హరిహర వీరమల్లు' సినిమా చేయడం నా అదృష్టం" అని ఆ సినిమా హీరోయిన్ నిధి అగర్వాల్ పేర్కొంది.

దిశ, సూర్యాపేట : ''నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని అని.. ఆయన తో 'హరిహర వీరమల్లు' సినిమా చేయడం నా అదృష్టం" అని ఆ సినిమా హీరోయిన్ నిధి అగర్వాల్ పేర్కొంది. ఆదివారం సూర్యా పేట జిల్లా కేంద్రం లోనీ నూతన వివాహ మహోత్సవ షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. అనoతరం ఆమె మీడియా తో మాట్లాడారు. ఇవాళ జరిగే న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఇండియా క్రికెట్ జట్టు కు అల్ ది బెస్ట్ తెలియజేశారు. ప్రభాస్ తో రాజాసాబ్ సినిమా చేయడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టిందన్నారు. వచ్చే నెలలో పెద్ద సినిమా ప్రాజెక్ట్ లు ఉన్నాయని.. త్వరలో అప్డేట్స్ మీడియాకు వెల్లడించనున్నట్టు తెలిపారు. చీరలు కావాలంటే హైదరాబాద్ కు వెళ్లే మహిళలకు వివాహ మహోత్సవ షాపింగ్ మాల్ లోకల్ లోనే ఏర్పాటు చేయడం హర్షనియమని అన్నారు. రాష్ట్ర రాజధానినీ తలదన్నేలా షాపింగ్ మాల్ ను ఏర్పాటు చేసి అన్ని రకాల చీరల తో, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే అందిస్తున్న శింగిరికొండ రవీందర్ ను, ఆయన కుమారుడు వంశినీ ఆమె అభినందించారు.






