అనుమానస్పద స్థితిలో యువకుడు మృతి..

by Bhanu |

అనుమానాస్ప స్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన హుజూర్ నగర్ పట్టణంలో చోటుచేసుకుంది. ఎస్సై ముత్తయ్య మృతుని బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

అనుమానస్పద స్థితిలో యువకుడు మృతి..
X

దిశ, హుజూర్ నగర్ : అనుమానాస్ప స్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన హుజూర్ నగర్ పట్టణంలో చోటుచేసుకుంది. ఎస్సై ముత్తయ్య మృతుని బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హుజూర్ నగర్ పట్టణంలోని దీక్షిత్ నగర్ కు చెందిన చింతల రాములు (20) అనే యువకుడు అతని ఇద్దరి స్నేహితులతో కలిసి మే నెల 30న రాత్రి బాగా మద్యం తాగి తను కిరాయి ఉంటున్న ఇంటికి వచ్చి నిద్రపోయాడని చెప్పారు. మరుసటి రోజు శనివారం నిద్ర లేకపోవడంతో తలుపు తీయలేదు.


దీంతో అనుమానంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా మృతుడు రాములు పడుకున్న బెడ్ పక్కన కింద పడి అపస్మారక ఉన్నాడని అతని వెంటనే హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారని తెలిపారు. మృతుని సోదరి ఆలకుంట్ల గోపమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు పడుతున్నట్లు ఎస్సై తెలిపారు. అయితే ఈ యువకుని మృతి పట్ల పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు చేయాల్సి ఉంది.

Next Story