అదుపుతప్పి ఇటుక బట్టీల్లోకి దూసుకు వెళ్లిన కారు

by Bhanu |

కారు అదుపుతప్పి ఇటుక బట్టిలోకి దూసుకుపోయిన సంఘటన ఆదివారం హుజూర్ నగర్ మండలం గోపాలపురం గ్రామం సమీపంలో చోటు చేసుకుంది.

అదుపుతప్పి ఇటుక బట్టీల్లోకి దూసుకు వెళ్లిన కారు
X

దిశ, హుజూర్ నగర్ : కారు అదుపుతప్పి ఇటుక బట్టిలోకి దూసుకుపోయిన సంఘటన ఆదివారం హుజూర్ నగర్ మండలం గోపాలపురం గ్రామం సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హుజూర్ నగర్ పట్టణానికి చెందిన పల్లేటి సుందర్ గ్రాండ్ ఐ10 కారు (TS 11EU4472 )మిర్యాలగూడ లోని బంధువుల వివాహానికి బయలుదేరారు. గోపాలపురం లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ సమీపంలోకి రాగానే వెనక నుంచి హోండాగ్లామర్ బండి అడ్డుగా రావటంతో దానిని తప్పించ బోయి కారు అదుపుతప్పి ఇటుక బట్టీల్లోకి దూసుకు వెళ్లి ఇటుక బట్టీలను ఢీ కొట్టింది. వెంటనే కారు బెలూన్లు ఓపెన్ కావడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.పల్లేటి రాములమ్మకు వెన్నుపూస, కాలుకు గాయం కావడంతో సూర్యాపేటలోని సంపత్ కుమార్ హాస్పిటల్ కు తరలించారు.


Next Story