హుజూర్ నగర్ బార్ అసోసియేషన్ రాంరెడ్డి ప్యానల్ ఘనవిజయం.

by Bhanu |

హుజూర్ నగర్ బార్ అసోసియేషన్ 2025 -26 సంవత్సరానికి గాను కార్యవర్గ ఎంపిక కొరకు శుక్రవారం నిర్వహించిన ఎన్నికలలో ప్రస్తుత అధ్యక్షుడు సాముల రాంరెడ్డి ప్యానల్ ఘన విజయం సాధించింది.

హుజూర్ నగర్ బార్ అసోసియేషన్ రాంరెడ్డి ప్యానల్ ఘనవిజయం.
X

దిశ, హుజూర్ నగర్:హుజూర్ నగర్ బార్ అసోసియేషన్ 2025 -26 సంవత్సరానికి గాను కార్యవర్గ ఎంపిక కొరకు శుక్రవారం నిర్వహించిన ఎన్నికలలో ప్రస్తుత అధ్యక్షుడు సాముల రాంరెడ్డి ప్యానల్ ఘన విజయం సాధించింది.తన ప్రత్యర్థి వర్గం ఒక్క స్థానం కూడా సాధించలేకపోయింది. బార్ అసోసియేషన్ లో మొత్తం 83 మంది ఓటర్లు ఉండగా 82 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో సాముల రాంరెడ్డి తన సమీప ప్రత్యర్థి జక్కుల వీరయ్య పై 41 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. సాముల రాంరెడ్డికి 61 ఓట్లు రాగా జక్కుల వీరయ్యకు 20 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు చెల్లుబాటు కాలేదు. ఉపాధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో జక్కుల నాగేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి కుక్కడపు సైదులుపై 31 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నాగేశ్వరరావుకు 56 ఓట్లు రాగా సైదులుకు 25 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు చెల్లుబాటు కాలేదు. జనరల్ సెక్రెటరీ పదవికి జరిగిన ఎన్నికలలో చనగాని యాదగిరి తన సమీప ప్రత్యర్థి భూక్య నాగేశ్వరరావు పై 41 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


యాదగిరి కి 60 ఓట్లు రాగా నాగేశ్వరరావుకు 19 ఓట్లు వచ్చాయి. 03 ఓట్లు చెల్లుబాటు కాలేదు. జాయింట్ సెక్రెటరీ పదవికి జరిగిన ఎన్నికల్లో కొట్టు సురేష్ తన సమీప ప్రత్యర్థి మద్దుల నాగేశ్వరరావు పై 49 ఓట్ల మెజార్టీ విజయం సాధించారు. సురేష్ కి 64 ఓట్లు రాగా నాగేశ్వరరావుకు 15 ఓట్లు వచ్చాయి. 03 ఓట్లు చెల్లుబాటు కాలేదు. కోశాధికారి పదవికి జరిగిన ఎన్నికలలో ఉప్పల గోపాలకృష్ణమూర్తి తన సమీప ప్రత్యర్థి నీలం విజయదుర్గపై 53 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గోపాలకృష్ణమూర్తికి 67 ఓట్లు రాగా విజయదుర్గకు 14 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు చెల్లుబాటు కాలేదు. గ్రంథాలయ కార్యదర్శి పదవికి జరిగిన ఎన్నికల్లో చిత్రం విశ్వనాథం తన సమీప ప్రత్యర్థి కొనతం శ్రీనివాసరెడ్డి పై 17 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. విశ్వనాధానికి 49 ఓట్లు దాకా శ్రీనివాస్ రెడ్డికి 32 ఓట్లు వచ్చాయి. క్రీడల మరియు సాంస్కృతిక కార్యదర్శి గొల్లగోపు నవీన్ తన సమీప ప్రత్యర్థి గుగులోతు వెంకటేష్ నాయక్ పై 63 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

మొత్తం 08 మంది కార్యవర్గ సభ్యులుగా పోటీ చేయగా ఐదుగురు గెలుపొందినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ధూళిపాల శ్రీనివాసరావుకు 68 ఓట్లు గొట్టే ప్రశాంత్ కు 64 ఓట్లు కమతం నాగర్జునకు 67 ఓట్లు షేక్ సైదా హుస్సేన్ కు 72 ఓట్లు చిట్టిపోలు రమేష్ కు 70 ఓట్లు బానోతు శంకర్ నాయక్ 9 ఓట్లు షేక్ మౌలాబీకి 21 ఓట్లు రామినేని వెంకటేశుకు 10 ఓట్లు లభించినట్లు ఎన్నికల అధికారులు ఎంఎస్ రాఘవరావు వట్టికూటి అంజయ్యలు ప్రకటించారు.


Next Story