- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్య నిర్వాకం కళ్లారా చూసి.. ఉరేసుకొని భర్త మృతి..!
గత కొద్ది రోజులుగా భార్య చేస్తున్న నిర్వాకాన్ని రెడ్ హ్యాండెడ్ గా చూసి భర్త ఉరి వేసుకొని ఆత్మహత్య యత్నం చేసుకున్న వ్యక్తి ఆసుపత్రిలో శనివారం మృతి చెందాడు.

దిశ, మర్రిగూడ : గత కొద్ది రోజులుగా భార్య చేస్తున్న నిర్వాకాన్ని రెడ్ హ్యాండెడ్ గా చూసి భర్త ఉరి వేసుకొని ఆత్మహత్య యత్నం చేసుకున్న వ్యక్తి ఆసుపత్రిలో శనివారం మృతి చెందాడు. మండలంలోని వెంకేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న వెంకేపల్లితండాలో ఆత్మహత్య కు పాల్పడి మూడు రోజులుగా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. మృతుడు బాలాజీ తన పరువు పోయిందని తాను చనిపోతున్నానని సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది . గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకే పల్లితండాకు చెందిన జటావత్ బాలాజీ కి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు. ఇదే తండాకు చెందిన బాధితుడి బాబాయి కుమారుడు ఆమనగల్ మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. బాలాజీ కి తమ్ముడు వరుసైన ఆ ఉపాధ్యాయుడు గత మూడు సంవత్సరాలుగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వ్యక్తి సభ్య సమాజం తలదించుకునేలా వరుసకు వదిన అయినా అన్న భార్యతో అక్రమ సంబంధం కొనసాగించాడు. దీనిపై పలుమార్లు ఆ ఉపాధ్యాయుని బాలాజీ మందలించినట్లు గ్రామస్తులు తెలిపారు.
తీరుమారని ఆ ఉపాధ్యాయుడి అక్రమ సంబంధాన్ని రెడ్ హ్యాండెడ్ గా బాలాజీకి పట్టుబడంతో ఒకంత మనస్థాపానికి లోనైనా బాలాజీ ఉరి వేసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. గుర్తించిన గ్రామస్తులు బాలాజీని హుటాహుటిన హైదరాబాద్ తరలించి వైద్య చికిత్స అందించిన మూడు రోజులుగా పోరాడి శనివారం మృతి చెందాడు . ప్రస్తుతం బాధితుడు ఉరి పెట్టుకోబోయే ముందు కుమారునితో కలిసి ఏడుస్తూ తీసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. గ్రామస్తులు బంధువులు సైతం పోలీస్ స్టేషన్ కి వచ్చి నిందితుడైన ఉపాధ్యాయుడి పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఒక పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఇటువంటి పచ్చని సంసారం అవుతాయి లో చిచ్చుపెట్టిన ఆ ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించి బాధితుడి పిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా నాంపల్లి సర్కిల్ ఇన్ స్పెక్టర్ దూది రాజు ఆధ్వర్యంలో మర్రిగూడ ఎస్సై మునగాల కృష్ణారెడ్డి గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.






