నిరాశలో ఆశావహులు..

by I. Sairam |

రిజర్వేషన్ల మార్పుతో నాయకులు అనుకున్నది ఒక్కటి అయిందొక్కటి అని నిరుత్సాహంలో ఉన్నారు.

నిరాశలో ఆశావహులు..
X

దిశ, సూర్యాపేట: రిజర్వేషన్ల మార్పుతో నాయకులు అనుకున్నది ఒక్కటి అయిందొక్కటి అని నిరుత్సాహంలో ఉన్నారు. గత ఏడాదిన్నరగా పలు మున్సిపాలిటిల్లోని ఆయా వార్డుల్లో పలు కార్యక్రమాలను సొంత నిధులతో చేపట్టారు. ఆయా వార్దులో శుభకార్యాలకు, చావులకు ఆర్థిక సాయం అందజేశారు. ఇన్నేళ్ళు ప్రజలకు పెట్టిన ఖర్చు బూడిదలో పోసినట్లయిందని ఇప్పుడు బాధపడుతున్నారు. రిజర్వేష న్ న్లు పాత పద్ధతిలో కొనసాగుతాయనే ఆశతో ఎంతో మంది ఆశావహులు కౌన్సిలర్గా పోటీ చేద్దామనుకు న్నారు. ఆయా మున్సిపాలిటిల్లో కౌన్సిలర్లుగా బరిలో ఉంటున్నామని ప్రజలతో మమేకమవుతూ ప్రచారం చేస్తు న్నారు. కొందరైతే ఇటీవల గణేష్ మండపాలకు, దుర్గా మాతల మండపాలకు భారీగా చందాలు సైతం సమ ర్పించుకున్నారు. ఇలా ఎంతో మంది ఆశావహులు లక్ష ల రూపాయలు ఖర్చు చేశారు. అయితే రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు మారడంతో ఆయా వార్డుల్లో ముందు నుంచి ఖర్చు పెట్టుకున్న వారి ఆశ లు గల్లంతయ్యాయి. రిజర్వేషన్ లు ఆనుకూలించక ఎన్నికల్లో పోటీ కి అవకాశం లేక పోవడంతో కొందరు తప్పుకుంటుండగా మరికొందరు తమ అనుచరు లను బరిలోదింపేందుకు కసరత్తులు చేస్తున్నారు.

తలరాతలు తారుమారు....

మున్సిపల్ ఎన్నికలకు ప్రకటించిన రిజర్వేషన్లు నేతల తలరాతలను తారు మారు చేశాయి. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి తమ సత్తా చాటాలని ఎంతో మంది ఆశావహులు ముందస్తు వ్యూహాలు రచించుకున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సరే తాము బరిలో ఉండవచ్చుననే ధీమాతో కౌన్సిలర్ పదవిపై ఆశలో పెట్టుకొని పలువురు నాయ కులు తమ ప్రయత్నాల్లో మునిగితేలారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు దాదాపు ఏడాదిన్నరగా ఆయా వార్డు ల్లో పర్యటిస్తూ వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ఇందు కు లక్షలాది రూపాయలు కూడా ఖర్చు చేసి నట్లు సమాచారం. ఎన్నో ఆశలతో ఇటు పార్టీ అటు ప్రజల కోసం శ్రమించిన అనేక మంది నాయకుల ఆశలు ప్రభుత్వం శనివారం అధికారికంగా ప్రకటించిన రిజర్వేషన్లతో గల్లంతయ్యాయి. ఒక్కరిద్దరికి మినహా రిజర్వేషన్లు అనుకూలంగా రాలేదు. తమకు కాక పోయిన కనీసం మహిళా రిజర్వేషన్లలో భార్య లేదా తల్లిని పోటీకి దింపాలనుకునేవారికి భంగపాటే ఎదురైంది.

రొటేషన్ పద్దతిలో రిజర్వేషన్లు...

జిల్లాలోని ఆయా మున్సిపాలిటిల్లోని అన్ని వార్డుల్లో రిజర్వేషన్లు తారుమారయ్యాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో జనరల్ స్థానాలుగా ఉన్న వార్డులు ఇతరులకు రిజర్వేషన్లు కాగా జనరల్ స్థానంలో ఉన్న రిజర్వేషన్లు తాజాగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. అలాగే మున్సిపల్ చైర్ పర్సన్ స్థానాలు సైతం తారుమార య్యాయి. రొటేషన్ పద్దతిలో రిజర్వేషన్లు మారడంతో మహిళలకు కొన్ని వార్డులు రిజర్వు అయ్యాయి. దీంతో ఆయా స్థానాలపై ఆశలు పెట్టుకున్న నేతలు వారి భార్యలను, కుటుంబ సభ్యులను రంగంలోకి దింపే యోచనలో ఉన్నారు. ఏదేమైన ప్రభుత్వం రొటేషన్ పద్దతిలో ప్రకటించిన మున్సిపల్ రిజర్వేషన్లు ఎంతో మంది ఆశావహులను నిరాశపరిచాయి. సూర్యాపేట జిల్లా కేంద్రం చైర్మన్ గతంలో జనరల్ మహిళ ఉండగా ప్రస్తుతం జనరల్ గా కేటాయించారు.

సూర్యాపేట జిల్లాలో మున్సిపల్ రిజర్వేషన్లు ఇవే..

సూర్యాపేట వార్డులు 48: ఎస్టీ 4, ఎస్సీ 7, బీసీ13, జనరల్ 24.

తిరుమలగిరి వార్డులు 15: ఎస్టీ 1, ఎస్సీ3, బిసి 3, జనరల్ 8.

కోదాడ వార్డులు 35: ఎస్టీ 2, ఎస్సీ 5, బిసి10, జనరల్ 18.

హుజూర్ నగర్ వార్డులు 28: ఎస్టీ 1, ఎస్సీ 4, బిసి 9, జనరల్ 14.

నేరేడుచర్ల వార్డులు 15: ఎస్టీ 1, ఎస్సీ 3, బిసి 3, జనరల్ 8.

Next Story