గ్రామ ఆరోగ్యానికి వెన్నెముక ఆశావ‌ర్క‌ర్లు : స‌ర్పంచ్ భూక్యా ర‌వీంద‌ర్ నాయ‌క్

by Nallavelli.Anjaneyulu |

గ్రామ ఆరోగ్యానికి వెన్నెముక ఆశావ‌ర్క‌ర్లు అని చెన్నాయిపాలెం స‌ర్పంచ్ భూక్యా ర‌వీంద‌ర్ నాయ‌క్ పేర్కొన్నారు.

గ్రామ ఆరోగ్యానికి వెన్నెముక ఆశావ‌ర్క‌ర్లు : స‌ర్పంచ్ భూక్యా ర‌వీంద‌ర్ నాయ‌క్
X

దిశ‌, మ‌ఠంప‌ల్లి : గ్రామ ఆరోగ్యానికి వెన్నెముక ఆశావ‌ర్క‌ర్లు అని చెన్నాయిపాలెం స‌ర్పంచ్ భూక్యా ర‌వీంద‌ర్ నాయ‌క్ పేర్కొన్నారు. మండ‌ల ప‌రిధిలోని చెన్నాయిపాలెం గ్రామ‌పంచాయ‌తీ కార్యాల‌యంలో ఆశావ‌ర్క‌ర్ల‌కు యూనిఫామ పంపిణీ చేశారు స‌ర్పంచ్ ర‌వీంద‌ర్ నాయ‌క్. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ గ్రామాలలో గర్భిణీల సంరక్షణ నుంచి పిల్లల టీకాల వరకు ఆరోగ్య అవగాహన కార్యక్రమాల నుంచి ప్రభుత్వ పథకాల అమలు వరకు ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలు అమూల్యమని తెలిపారు. ముఖ్యంగా కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కాపాడిన ఆశా కార్యకర్తల సేవలను గ్రామం ఎప్పటికీ మరచిపోదన్నారు. గ్రామ ఆరోగ్యానికి ఆశా వర్కర్లు నిజమైన వెన్నెముకలని కొనియాడారు. ఏఎన్ఎం సక్కుబాయి, సంబంధిత వార్డు నెంబర్లతో కలిసి సర్పంచ్ ఆశా వర్కర్లకు యూనిఫామ్ చీరలను పంపిణీ చేశారు. ఆశా కార్యకర్తలు తమ విధులను అదే నిబద్ధతతో కొనసాగిస్తూ గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డు నెంబర్లు భూక్యా గోవర్ధన్ నాయక్, బానోతు నాగార్జున నాయక్, బానోతు బిందు, శంకర్ నాయక్ పాల్గొన్నారు.

Next Story