లయన్స్ క్లబ్ ద్వారా చారిత్రాత్మకమైన సేవలు..

by Kodari Anjali |

ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్ ద్వారా చారిత్రాత్మకమైన సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆ క్లబ్ జిల్లా రెండో గవర్నర్ గుడిపూడి వెంకటేశ్వరరావు అన్నారు.

లయన్స్ క్లబ్ ద్వారా చారిత్రాత్మకమైన సేవలు..
X

దిశ, తుంగతుర్తి: ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్ ద్వారా చారిత్రాత్మకమైన సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆ క్లబ్ జిల్లా రెండో గవర్నర్ గుడిపూడి వెంకటేశ్వరరావు అన్నారు. ఇందులో భాగంగానే కంటి సమస్యలతో బాధపడుతున్న లక్షలాది మంది బాధితులకు క్లబ్ ద్వారా సేవలు అందుతున్నాయని వివరించారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కంటి సమస్యతో అనేకమంది బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తుంగతుర్తిలో బుధవారం జరిగిన మండల లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.క్లబ్ క్లబ్ ద్వారా రాజకీయాల కతీతంగా సభ్యుల సమిష్టి కృషితో బాధితులకు సేవలు అందుతున్నాయన్నారు.

లయన్స్ క్లబ్ నూతన కమిటీ అధ్యక్షులుగా..

ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రాంతాలకు సేవలందిస్తూ లయన్స్ క్లబ్ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు.కార్యక్రమంలో జిల్లా గవర్నర్ మోహన్ రావు,పీఎంజేఎఫ్ లయన్ మదన్ మోహన్ రెడ్డి, లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ దోసపాటి గోపాల్,ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వర్లు సర్పంచ్ మల్లెపాక సాయిబాబు, క్లబ్ కు చెందిన కోడి సతీష్, పాలవరపు సంతోష్, తోట శ్యాంప్రసాద్ తో పాటు నూతనకల్ మద్దిరాల, సూర్యాపేట, తదితర ప్రాంతాల నుండి పలువురు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే తుంగతుర్తి మండల లయన్స్ క్లబ్ నూతన కమిటీ అధ్యక్షులుగా తల్లాడ పద్మ కేదారి, కార్యదర్శిగా గుండగాని రాము,కోశాధికారిగా ఓరుగంటి శ్రీనివాస్ లు ఎంపికై ప్రమాణ స్వీకారం చేశారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల నుండి పదిలో ర్యాంకు సాధించిన కటకం కావ్య, కరాటే మాస్టర్ గా రాణిస్తున్న బొంకూరి అరుణలను క్లబ్ సభ్యులు సన్మానించారు.

Next Story