విద్యార్థిని కుటుంబానికి టీచర్ల సహాయం

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, తుంగ‌తుర్తి : త‌మ పాఠ‌శాల‌లో చ‌దువుతూ తండ్రిని కోల్పోయి కష్టాల్లో ఉన్న పేద విద్యార్థిని పరిస్థితులను గ్రహించిన ఉపాధ్యాయులు చలించిపోయారు. ఈ మేరకు ఉపాధ్యాయులంతా భాగస్వాములై

విద్యార్థిని కుటుంబానికి టీచర్ల సహాయం
X

దిశ‌, తుంగ‌తుర్తి : త‌మ పాఠ‌శాల‌లో చ‌దువుతూ తండ్రిని కోల్పోయి కష్టాల్లో ఉన్న పేద విద్యార్థిని పరిస్థితులను గ్రహించిన ఉపాధ్యాయులు చలించిపోయారు. ఈ మేరకు ఉపాధ్యాయులంతా భాగస్వాములై తమ వంతుగా ఆర్థిక సహాయం అందజేసి తోడుగా నిలిచిన సంఘటన తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జలగం రజిత స్థానిక జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో 10వ తరగతి చదువుతున్నారు. ఇటీవల రజిత తండ్రి రవి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ పేద కుటుంబానికి కష్టాలొచ్చాయి. ఇది తెలుసుకున్న ఉపాధ్యాయులంతా విచారాన్ని వ్యక్తం చేస్తూ మానవతా దృక్పథంతో అంతా కలిసి రూ.5 వేలను విద్యార్థిని తల్లి మంగమ్మకు అందజేశారు. హెచ్.ఎం పి.శ్రీహ‌రి, ఉపాధ్యాయులు పుల్ల‌య్య‌, తిరుమ‌ల్ రెడ్డి, ర‌మేష్, సురేంద‌ర్, కిర‌ణ్ బాబు పాల్గొన్నారు.

Next Story