- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గౌరవ సభ్యులను అప్పుడే మరిచారా..?
ఎన్నికలు జరిగి కనీసం నెల రోజులు కూడా గడవకముందే అధికారిక సమావేశాల్లో మహిళా కౌన్సిలర్లకు బదులు వారి భర్తలు దర్శనమివ్వడం పట్టణ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. హా

దిశ, హాలియా : మహిళలకు అన్ని రంగాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పాలక ప్రభుత్వాలు చట్టాలు తెచ్చినప్పటికీ ఆడవాళ్లు మాత్రం వంటింటికే పరిమితం అన్న చందంగా హాలియా మున్సిపాలిటీలో శుక్రవారం ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక ప్రారంభ అధికారిక కార్యక్రమమే అద్ధం పడుతుంది. ఎన్నికలు జరిగి కనీసం నెల రోజులు కూడా గడవకముందే అధికారిక సమావేశాల్లో మహిళా కౌన్సిలర్లకు బదులు వారి భర్తలు దర్శనమివ్వడం పట్టణ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. హాలియా మున్సిపాలిటీలో మొత్తం 12 మంది కౌన్సిలర్లకు ఆరుగురు మహిళా కౌన్సిలర్లు ఉన్నారు.
వీరిలో అధికారిక కార్యక్రమానికి కనీసం ఒక్కరు కూడా హాజరు కాకపోవడం విస్మయం వ్యక్తం అవుతుంది. ప్రజా పాలన సన్నాహక సమావేశానికి సైతం మహిళా కౌన్సిలర్లకు బదులుగా భర్తలే సమావేశానికి రావడం చర్చనీయాంశంగా మారింది. అధికారుల సాక్షిగా తమ భర్తలే భార్యలను అధికారిక సమావేశానికి తీసుకురాకపోవడం తో ఎన్నికైన మహిళా కౌన్సిలర్లకు ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉంటుందా..? అని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఓవైపు చట్టసభల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై మహిళా సంఘాలు గొంతెత్తి ప్రశ్నిస్తుంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజలతో ఎన్నుకోబడిన మహిళ ప్రజా ప్రతినిధులకు ఇచ్చే గౌరవం ఇదేనా...? అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.






