- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ప్రజలకు సంక్రాతి శుభాకాంక్షలు
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : తెలంగాణ ప్రజలకు రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి రైతుల పండుగని, వానాకాలం పంట కోతలు పూర్తయి ధాన్యం ఇంటికి చేరిన సమయంలో గ్రామీణ సంస్కృతి, వ్యవసాయ సాంప్రదాయాలను అనుసరిస్తూ రైతులు జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ అని చెప్పారు. భోగభాగ్యాలతో "భోగి”, సకల సంపదలతో "సంక్రాంతి", కన్నుల పండుగగా "కనుమ"ను జరుపుకోవాలన్నారు. భోగి మంటలు, గాలి పటాల సందళ్ళతో పాటుగా తెలంగాణ సంప్రదాయ సకినాల పిండివంటలతో ఈ మూడు రోజులు కోలాహలంగా ఉంటుందని వివరించారు. తమ కుటుంబ సభ్యులు, బంధు, మిత్రులతో కలిసి ప్రజలందరూ సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆయన తెలిపారు. ప్రమాదకర చైనా మాంజను వాడవద్దని, పంతంగులు ఎగురవేసి సందర్భంలో చాలా జాగ్రత్తగా ఎగురవేయలని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.






