- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెత్త కుప్పలుగా విద్యార్థునుల హాల్ టికెట్లు.. ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల యవ్వారం
నల్లగొండలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల మరోసారి నిర్లక్ష్యం కి వేదికగా మారింది. పరీక్షల సమీపంలో విద్యార్థినులకు హాల్ టికెట్లు పంపిణీ చేయాల్సిన కాలేజీ సిబ్బంది తీరుపై విద్యార్థుల ఆవేదన తారాస్థాయికి చేరింది.

దిశ, నల్లగొండ: నల్లగొండలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల మరోసారి నిర్లక్ష్యం కి వేదికగా మారింది. పరీక్షల సమీపంలో విద్యార్థినులకు హాల్ టికెట్లు పంపిణీ చేయాల్సిన కాలేజీ సిబ్బంది తీరుపై విద్యార్థుల ఆవేదన తారాస్థాయికి చేరింది. విధిగా, హాల్ టికెట్లను విద్యార్థులకు సమర్పించాల్సిన సమయంలో, అవి కాగితపు చెత్తలా నేలమీద విసిరేసి అక్కడినుంచి కళాశాల సిబ్బంది వెళ్లిపోయారు. బాధిత విద్యార్థినులు తమ హాల్ టిక్కెట్ ఎక్కడ ఉందో అని వేతకదడానికి సమయం సరిపోలేదు హాల్ టికెట్లను వెతుక్కుంటూ కనిపించిన దృశ్యం హృదయాన్ని కలచివేసింది.ఈ కలశాల లో ఎన్నో కలలు తో చదువుకోవడం కోసం వచ్చిన విద్యార్థునుల కు తప్పని తిప్పలుగా సిబ్బంది తీరు కనిపిస్తుంది ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లోకి ఎక్కుతుంది.జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కలశాల పై విద్యార్థునుల చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టిన కానీ సిబ్బంది వైఫల్యం తో ఆయన ఆశయ సాధన కష్టం మారింది.
సిబ్బంది నిర్లక్ష్యంకి విద్యార్థునులు బలి:
మా చదువు పట్ల మా శ్రద్ధకన్నా కాలేజీకి బాధ్యత అన్న మాట లేనట్టుంది. ఒక్కటేమీ కాదు... ఏ ఒక్క సిబ్బంది కూడా అక్కడ లేరు. మేము మా హాల్ టికెట్ల కోసం భూమిమీద వెతుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది మా గౌరవాన్ని దిగజార్చిన ఘటన, అంటూ ఓ విద్యార్థిని బాధతో వెల్లడించింది.ఈ ఘటన ప్రభుత్వ విద్యా సంస్థల పరిపాలనా వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఒక్క పరీక్ష హాల్ టికెట్ అన్నదే కాదు, ఇది ఒక విద్యార్థి జీవితానికి వేదిక. అలాంటి ముఖ్యమైన పత్రాలను ఇలానే విసిరివేయడం, ఆపై కనీసం సమన్వయ సిబ్బంది లేకుండా వ్యవహరించడం ఘోర అపరాధమే.
ప్రభుత్వం స్పందించాలిసిన అవసరం ఉంది :
ఈ ఘటనపై ఉన్నత విద్యాశాఖ అధికారులు,కలెక్టర్,జిల్లా మంత్రి తక్షణమే స్పందించి, కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు పరీక్షల నిర్వహణ బాధ్యత ఉన్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ కళాశాలల్లో నిర్వహణ ప్రమాణాలు ఈ స్థాయిలో పడిపోతే, సామాన్య విద్యార్థికి న్యాయం ఎక్కడ దొరుకుతుంది. ఈతరం విద్యార్థులకి కలలు కన్నే హక్కు ఉంది. అలాంటి కలలు వేల్దే ముందు నేలమీద పడేస్తున్న వ్యవస్థను ప్రశ్నించాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది.ఇకనైనా కళాశాలలు తమ విధులను గౌరవంగా, బాధ్యతగా నిర్వర్తించాలి. లేదంటే విద్యార్థుల నమ్మకాన్ని కోల్పోయిన తరువాత పశ్చాత్తాపం ఉపయోగం ఉండదు.






