- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాలియా మున్సిపాలిటీ ఓటర్ల జాబితా సిద్ధం
దిశ, హాలియా : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేయబడిన హాలియా మున్సిపాలిటీ ఓటర్ల జాబితా ను మున్సిపల్ అధికారులు విడుదల చేశారు.

దిశ, హాలియా : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేయబడిన హాలియా మున్సిపాలిటీ ఓటర్ల జాబితా ను మున్సిపల్ అధికారులు విడుదల చేశారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితాను విడుదల చేసినట్లు మున్సిపల్ కమిషనర్ రామదుర్గా రెడ్డి తెలిపారు. గడచిన శాసనసభ నియోజకవర్గ నియోజకవర్గ ఓటర్ల జాబితా ఆధారంగా ఇట్టి డ్రాఫ్ట్ను విడుదల చేశారు. హాలియా మున్సిపాలిటీలో మొత్తం ఓటర్లు 12,807 మంది ఉండగా.. ఇందులో పురుష ఓటర్లు 6270 మంది, మహిళా ఓటర్లు 6529 ఓటర్లు, ఇతరులు ఇద్దరు ఉన్నట్లు అధికారులు డ్రాఫ్ట్ లో దృవీకరించారు. 12 వార్డులకు ఓటరు జాబితాను సిద్ధం చేసినట్లు మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. ఓటర్ జాబితా పై అభ్యంతరాల నేపథ్యంలో ఈనెల 5వ తేదీన అఖిలపక్ష పార్టీల సమావేశం నిర్వహించనున్నారు. జనవరి 06న జిల్లా స్థాయి సమావేశం నిర్వహించి 10వ తేదీన తుది జాబితాను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆయా వార్డుల వారిగా ఓటర్లు తమ ఓటర్ జాబితాలను పరిశీలించి ఏవైనా అభ్యంతరాలు ఉన్నచో వెంటనే సంబంధిత కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు.
మహిళా ఓటర్లే అధికం..
హాలియా మున్సిపాలిటీలో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జాబితా ఆధారంగా హాలియా మున్సిపాలిటీలో పురుషుల కన్నా 259 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. గదిచిన ఎన్నికల్లో ఇబ్రహీంపేట తో కలిపి 12 వార్డులు ఉండగా గత సంవత్సరం ఇబ్రహీంపేట గ్రామాన్ని గ్రామపంచాయతీగా విభజించడంతో తిరిగి వార్డుల పునర్విభజన చేపట్టి 12 వార్డులుగా తయారు చేశారు.






