నాగార్జున సాగ‌ర్ - శ్రీశైలం లాంచీ ప్ర‌యాణానికి గ్రీన్ సిగ్న‌ల్

by Ratna Kumari |

దిశ, నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ నుండి కృష్ణానదిపైగా శ్రీశైలం వైపు లాంచీ ప్రయాణాన్ని శనివారం తెలంగాణ టూరిజం వాటర్ ఫ్లూయిట్ జనరల్ మేనేజర్ మాన్వి ప్రారంభించారు. గత వారం

నాగార్జున సాగ‌ర్ - శ్రీశైలం లాంచీ ప్ర‌యాణానికి గ్రీన్ సిగ్న‌ల్
X

దిశ, నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ నుండి కృష్ణానదిపైగా శ్రీశైలం వైపు లాంచీ ప్రయాణాన్ని శనివారం తెలంగాణ టూరిజం వాటర్ ఫ్లూయిట్ జనరల్ మేనేజర్ మాన్వి ప్రారంభించారు. గత వారం ప్రారంభం కావాల్సిన ఈ ప్రయాణం కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం జీఎం మాన్వి జెండా ఊపి లాంచీ సేవలను ప్రారంభించగా.. సుమారు 30 మంది ప్రయాణికులతో లాంచీ నాగార్జున‌ సాగర్ నుంచి బయలుదేరి సాయంత్రానికి శ్రీశైలానికి చేరుకుంది. ప్రయాణికులు ఆదివారం సాయంత్రం తిరిగి నాగార్జునసాగర్ చేరుకోనున్నారు. కృష్ణా నది ఒడినడకల్లో నల్లమల్ల అడవుల మధ్య అద్భుత దృశ్యాల నడుమ సాగిన ఈ లాంచీ ప్రయాణాన్ని ప్రయాణికులు ప్రత్యేకంగా ఆస్వాదించారు. ఈ తొలి ప్రయాణంలో జీఎం మాన్వి తో పాటు సాగర్ లాంచీ యూనిట్ మేనేజర్ హరి, టూరిజం అధికారులు రాజేష్ పాల్గొన్నారు.

Next Story