- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు పోచంపల్లికి గవర్నర్ రాక.. పగడ్బందీగా ఏర్పాట్లు
భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని టూరిజం పార్కును నేడు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ వర్మ పర్యటించనున్నారని, ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు బుధవారం అధికారులను ఆదేశించారు.

దిశ, భూదాన్ పోచంపల్లి: భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని టూరిజం పార్కును రేపు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ వర్మ పర్యటించనున్నారని, ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు బుధవారం అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా టూరిజం పార్కులోని కాన్ఫరెన్స్ హాల్, చేనేత మగ్గాలు, మ్యూజియం, చేనేత గృహాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గవర్నర్ పర్యటనకు ఏర్పాట్లను పూర్తి చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సూచించారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. మండలంలోని అన్ని పాఠశాలలో పారిశుద్ధ్యం, ఎలక్ట్రిసిటీ, మధ్యాహ్న భోజనం, తరగతి గదుల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉపాధ్యాయులను, పాఠశాల కమిటీలను ఆదేశించారు.
రెండు రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ప్రారంభించాలి : జిల్లా కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను రెండు రోజుల్లో ప్రారంభించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. బుధవారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా మంజూరైన 695 మంది లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని ఎంపీడీవో భాస్కర్, మున్సిపల్ కమిషనర్ అంజన్ రెడ్డి ని అడిగి తెలుసుకున్నారు.
మొబైల్ అప్లికేషన్లలో ఫోటోలు నమోదు చేస్తేనే ఇండ్లు ప్రారంభ స్థాయికి వచ్చినట్లుగా పరిగణించబడుతుందని, 400 నుండి 600 స్క్వేర్ ఫీట్లు లోపే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేలా ఇందిరమ్మ కమిటీలు చైతన్య పరచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, డిసిపి అక్షాప్ట్ యాదవ్, రాష్ట్ర చేనేత జౌళి శాఖ డైరెక్టర్లు వెంకటేశ్వర్ రావు, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మ ,ఏడీఈ శ్రీనివాస్,చౌటుప్పల్ ఆర్డిఓ శేఖర్ రెడ్డి,చౌటుప్పల్ ఏసీపి మధుసూదన్ రెడ్డి, తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, కమిషనర్ అంజన్ రెడ్డి,ఎస్ ఐ భాస్కర్ రెడ్డి, చేనేత నాయకులు తడక రమేష్, కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు తదితరులు పాల్గొన్నారు.






