- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజా సంక్షేమం, అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
ప్రజా సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్ల ఐలయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జెఎఎస్ గార్డెన్ లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 140 మంది లబ్ధిదారులకు చెక్కు లను, 350 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను ఆయన పంపిణీ చేశారు.

దిశ,ఆత్మకూరు (ఎం) : ప్రజా సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్ల ఐలయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జెఎఎస్ గార్డెన్ లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 140 మంది లబ్ధిదారులకు చెక్కు లను, 350 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను ఆయన పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నమూనా ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు త్వరగా నిర్మించుకొని బిల్లులను పొందాలని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు జాబితాలో పేర్లు లేని వారు ఎవరు కూడా అధైర్యపడవద్దని ప్రతి ఏడాది మండలానికి 400 ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేస్తుందని, దీనితో అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ఆడబిడ్డలకు అండగా ప్రభుత్వం ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ లావణ్య మండల ప్రత్యేక అధికారి రాజారాం డిప్యూటీ తహశీల్దార్ సఫియోద్దీన్ ఆర్ ఐ మల్లికార్జునరావు మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుతల ప్రమీల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు యాస లక్ష్మారెడ్డి మాజీ ఎంపీపీ తండ మంగమ్మ శ్రీశైలం గౌడ్ మాజీ జెడ్పిటిసి కె నరేందర్ గుప్తా మాజీ సర్పంచ్ జన్నాయి కోడె నగేష్ మండల నాయకులు ముద్దసాని సిద్ధులు, కందడి అనంతరెడ్డి, బత్తిని ఉప్పలయ్య, భాషబోయిన పాపయ్య, తండ నరసింహ తదితరులు పాల్గొన్నారు.






