- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తీదేడు గ్రామంలో ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా చూడాలి : సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం తీదేడు గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి పేర్కొన్నారు.

దిశ, చింతపల్లి : నల్గొండ జిల్లా చింతపల్లి మండలం తీదేడు గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. తీదేడు గ్రామంలోని ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా చూడాలని తహాశీల్దార్ కి బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రభుత్వ భూమి గ్రామ నర్సరీ, గ్రామ అవసరాల కోసం కేటాయించాలన్నారు. తీదేడు సర్వే నెంబర్ 3/61/ఆ లో 20 గుంటల భూమి ఉందని 24 సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీ తరుఫున వేసిన బోరు, పైపులైను చుట్టూ కడీలు నాటి భూమిని ఇప్పుడు కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వబోరు ఉన్న భూమి నాదని కబ్జా చేయడం సమంజసం కాదన్నారు. అడ్డదారిలో ప్రభుత్వ భూమిని పోజిషన్ సర్టిఫికెట్ లేకున్నా పాసు పుస్తకం సంపాదించుకొని ప్రభుత్వం భూమి ఎక్కడ ఖాలిగా ఉంటే అక్కడ కబ్జా చేసుకోని ఇతరులపై దౌర్జన్యానికి పాల్పడుతున్న దాసరి మారయ్య పై విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇడబోయిన వెంకటయ్య యాదవ్, వార్డు సభ్యులు మాదగోని కృష్ణ గౌడ్, బొడ్డు పార్వతమ్మ, గంటెల అలివేలు సోమయ్య, రెడ్డి పద్మ పరమేష్, శివర్ల పర్వతాలు, గ్రామస్తులు మర్రు రామారావు, సోనగంటి గొవర్థనాచారి, మర్రు శ్రీనివాస రావు, కాయితి బచ్చిరెడ్డి, వీరమల్ల వెంకటయ్య, వీరమల్ల సత్తయ్య, వీరమల్ల జగదీష్, కాయితి బుచ్చిరెడ్డి, సిమర్ల శ్రీను యాదవ్, మెండె రాములు ఉన్నారు.






