- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రాణ నష్టానికి 25 లక్షలు, పంట నష్టానికి 30 వేలు ఇవ్వాలి
ఉత్తర తెలంగాణలో అతివృష్టితో ప్రాణ నష్టం చెందినవారికి రూ. 25 లక్షలు, పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 30,000

దిశ, రాజాపేట: ఉత్తర తెలంగాణలో అతివృష్టితో ప్రాణ నష్టం చెందినవారికి రూ. 25 లక్షలు, పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 30,000 చెల్లించాలని డిమాండ్ చేశారు మాజీ విప్, ఆలేరు మాజీ MLA గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. శుక్రవారం రాజాపేట మండల కేంద్రంలో, యువ సంకల్ప యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద ప్రభుత్వ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు... డిమాండ్ చేసిన నిధులు ఇప్పుడు ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. సీతక్క ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ప్రజలకు సాయం చేసినట్లుగా ప్రచారం చేశారని, మంత్రిగా మారిన తర్వాత అందరి సమక్షంలో సహాయం ఎందుకు చేయడం లేదని నిలదీశారు. మంత్రులందరూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని డిమాండ్ చేశారు.
ఇందులో మండల అధ్యక్షులు సట్టు తిరుమలేశ్, సంధిల భాస్కర్, మధుసూదన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, బెడిదే వీరేశం, గోపగని యాదగిరి, మార్ల నాగరాజు, మేక వెంకట్ రెడ్డి, ములుగు సోమ లింగం, జశ్వంత్, డొంకెన మహేందర్, అంకటి సుదర్శన్, గుర్రం నర్సింహులు, గజ్జెల రాజు, రాములు నాయక్, లక్ష్మన్ నాయక్, బాలకృష్ణ, వెంకటేశం మరియు యువసంకల్ప యూత్ సభ్యులు పాల్గొన్నారు.






