కంట్లో కారం చల్లి.. మెడలోని పుస్తెలతాడు చోరీ..

by Bhanu |

దాహం వేస్తుంది ....మంచినీళ్లు ఇవ్వమని ఓ వృద్ధురాలి ఇంటికి వెళ్లిన అడిగిన ఓ మహిళ ఆమె మంచినీళ్లు తెచ్చి ఇచ్చి తాగుతున్న క్రమంలో ఆమె మెడలోని బంగారం పుస్తెలతాడును లాక్కొని వెళ్లిన సంఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది.

కంట్లో కారం చల్లి.. మెడలోని పుస్తెలతాడు చోరీ..
X

దిశ, నేరేడుచర్ల : దాహం వేస్తుంది ....మంచినీళ్లు ఇవ్వమని ఓ వృద్ధురాలి ఇంటికి వెళ్లిన అడిగిన ఓ మహిళ ఆమె మంచినీళ్లు తెచ్చి ఇచ్చి తాగుతున్న క్రమంలో ఆమె మెడలోని బంగారం పుస్తెలతాడును లాక్కొని వెళ్లిన సంఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి నేరేడుచర్ల ఎస్సై రవీందర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నేరేడుచర్ల పట్టణంలోని గ్రంథాలయం వీధిలో నివాసం ఉంటున్న గుండా చంద్రకళ(62) ఇంట్లో ఒంటరిగా ఉందని తెలిపారు. ఆ సమయంలో త్రాగు నీళ్లు కావాలని ఓ మహిళ ఇంట్లోకి వచ్చి అడిగిందనీ వెంటనే తాగునీరును బాటిల్లో తీసుకవచ్చి ఇచ్చిందన్నారు.


మంచి నీరు తాగుతూ కావాలనే బాటిల్ మూతను కిందకు పడవేసిందని బాటిల్ మూత తేసేందుకు చంద్రకళ కిందకు వంగగా వెంటనే తన వెంట తెచ్చుకున్న కారమును కళ్లలో కారం కొట్టి మెడ మీద ఉన్న 2 తులాల బంగారు పుస్తెలతాడును లాక్కెల్లిందని చెప్పారు. దీంతో వెంటనే చంద్రకళ బయటకు వచ్చి ఇంటి చుట్టుపక్కల వారికి ఈ విషయం చెప్పడంతో వారు పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి చంద్రకళను వివరాలు అడిగామన్నారు. ఆ వృద్ధురాలు ఈ వీధిలోనే తిరిగే ఓ మహిళ పై అనుమానం వ్యక్తం చేసిందని తెలిపారు. దీంతో మహిళ దొంగతనానికి పాల్పడినట్లు అనుమానించి సిబ్బందితో కలిసి నిందుతురాలని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. చంద్రకళ కుమారుడు సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.




Next Story