తాటి చెట్టు పై నుంచి పడి గీత కార్మికుడికి గాయాలు

by Nallavelli.Anjaneyulu |

తాటి చెట్టు పై నుంచి ప‌డి గీత కార్మికుడికి గాయాలైన సంఘ‌ట‌న యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా భూదాన్ పోచంప‌ల్లి మున్సిపాలిటీ ప‌రిధిలోని ముక్తాపూర్ లో శుక్ర‌వారం చోటు చేసుకుంది.

తాటి చెట్టు పై నుంచి పడి గీత కార్మికుడికి గాయాలు
X

దిశ, భూదాన్ పోచంపల్లి : తాటి చెట్టు పై నుంచి ప‌డి గీత కార్మికుడికి గాయాలైన సంఘ‌ట‌న యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా భూదాన్ పోచంప‌ల్లి మున్సిపాలిటీ ప‌రిధిలోని ముక్తాపూర్ లో శుక్ర‌వారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముక్తాపూర్ కు చెందిన ఇట్టమోని పాండు కల్లు గీసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే రోజు మాదిరిగానే పాండు తాటికల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా.. కాలుజారి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో ఎడమ కన్నులో నుంచి తీవ్ర రక్తస్రావం జరిగింది. అలాగే చేతులకు, కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి త‌ల‌రించారు. అక్క‌డి నుంచి ఎయిమ్స్ కి త‌ర‌లించారు.

Next Story